Puri Jagannadh: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈయన నటి చార్మితో కలిసి సినిమాలో నిర్మించడం వల్ల ఎక్కువగా ముంబైలో నివసిస్తున్నారు దీంతో తన భార్యకు పూరి జగన్నాథ్ విడాకులు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు గురించి పరోక్షంగా బండ్ల గణేష్ సైతం పూరి జగన్నాథ్ పై తీవ్రస్థాయిలో మండిపడిన విషయం మనకు తెలిసిందే.

ఇలా గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ వ్యక్తిగత విషయాల గురించి వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు ఇకపోతే లైగర్ సినిమా ద్వారా భారీ నష్టాలను ఎదుర్కొన్నటువంటి పూరీ జగన్నాథ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే తాజాగా ఈయన తన ఫ్యామిలీతో కలిసి సొంతూరికి వెళ్లారు.
ఈ క్రమంలోనే తన భార్యతో కలిసి పూరి జగన్నాథ్ ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. అనంతరం తన కూతురు కొడుకుతో కలిసి ఈ పూజా కార్యక్రమాలను ఎంతో విజయవంతంగా పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను బండ్ల గణేష్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు.

Puri Jagannadh: సంతోషంగా ఉంది అన్న వదిన…
ఇలా ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ పూరి జగన్నాథ్ ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ ఇలా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అన్న వదిన అంటూ కామెంట్ పెట్టారు.ఈ విధంగా పూరి జగన్నాథ్ దంపతులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొనడంతో వీరి విడాకుల వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది.
Happy to see you Anna and Vadina ❤️🙏 https://t.co/F0zio9SRrM
— BANDLA GANESH. (@ganeshbandla) May 10, 2023