Nagachaitanya: అక్కినేని నాగచైతన్య తాజాగా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున అభిమానులను ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇక ఈ ఇంటర్వ్యూల సందర్భంగా ఈయన తన వృత్తిపరమైన విషయాల గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగచైతన్యకు యాంకర్ పలు రకాల ప్రశ్నలు వేస్తూ చైతన్య నుంచి సమాధానాలు రాబట్టారు.
ఈ క్రమంలోనే కస్టడీ సినిమాకు ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి అని యాంకర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ ఈ సినిమాలో ప్రముఖ నటుడు అరవిందస్వామి నటించారు. ఆయన పాత్రకు అనుగుణంగానే ఈ సినిమాకు కస్టడీ అనే పేరు పెట్టామని చైతన్య తెలియజేశారు. అయితే ఈ సినిమాకి ఇదే పేరు ఎందుకు పెట్టారనే విషయం సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని తెలిపారు.

Nagachaitanya: అఖిల్ తో సినిమా చేయడం కోసం ఎదురుచూస్తున్న…
ఈ సినిమాలో అరవింద స్వామి నటిస్తున్నారని తెలిసి సినిమాపై అందరికీ భారీ నమ్మకం ఏర్పడిందని తెలియజేశారు.ఇక ఈ సినిమాలో అరవిందస్వామి పాత్ర లేకపోతే అసలు కష్టపడి సినిమానే లేదని నాగచైతన్య చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.సినిమా చేయడం గురించి నాగచైతన్య మాట్లాడుతూ సరైన కంటెంట్ ఉంటే తప్పకుండా తమ్ముడితో కలిసి చేస్తానని దానికోసం తాను కూడా ఎదురు చూస్తున్నాం అంటూ సమాధానం చెప్పారు.