Rajamouli: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఛత్రపతి ఈ సినిమాలో ప్రభాస్ శ్రేయ హీరో హీరోయిన్లుగా నటించారు. మదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనాలను సృష్టించింది. ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ స్టార్ హీరోగా కూడా మారిపోయారు.

ఇక ఈ సినిమాని డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా రాజమౌళి స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే రాజమౌళి ప్రత్యేక వీడియో ద్వారా చత్రపతి చిత్ర బృందానికి ఈయన ఆల్ ద బెస్ట్ తెలియజేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ చత్రపతి సినిమా నాకు ఎప్పటికీ ఎంతో ప్రత్యేకమైనది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మాస్ డైరెక్టర్లలో వివి వినాయక్ ఒకరు. ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారని తెలిసి చాలా సంతోషించాను.

Rajamouli సాయి శ్రీనివాస్ కు కచ్చితంగా సరిపోతుంది…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంతో ఆదరణ కలిగిన నటుడు ఈ సినిమా తనకు కచ్చితంగా సరిపోతుందని రాజమౌళి తెలిపారు.ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని థియేటర్లోనే చూడాలి అంటూ ఈ సందర్భంగా రాజమౌళి ఈ చిత్ర బృందానికి విషెస్ తెలియజేశారు.తెలుగులో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా హిందీలో ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది, ఈ సినిమా సాయి శ్రీనివాస్ కు ఎలాంటి హిట్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.