Ramya Ragupathi -Naresh: సీనియర్ నటుడు నరేష్ తన మూడవ భార్య రమ్య రఘుపతి విషయం గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా వీరి వ్యవహారంలో ఒక పెద్ద ట్విస్ట్ నెలకొంది.నరేష్ తన మూడవ భార్య రమ్య రఘుపతి నుంచి తనకు ప్రాణహానీ ఉంది అంటూ కోర్టులో పిటిషన్ వేశారు.

తన భార్య రమ్య రఘుపతి రాకేష్ శెట్టితో కలిసి తనని హత్య చేయడానికి ప్లాన్ చేసిందని ఈయన పిటిషన్ లో పేర్కొన్నారు. రమ్య రఘుపతికి తనకన్నా తన ఆస్తి అంటేనే వ్యామోహం ఎక్కువ అని ఆస్తి కోసం తనను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఈయన ఆరోపించారు.
2010 వ సంవత్సరంలో తాను రమ్యను వివాహం చేసుకున్నానని వివాహం చేసుకున్న కొన్ని నెలల నుంచి తనకు టార్చర్ మొదలైందని తన టార్చర్ భరించలేకపోతున్నాను తనకు వెంటనే విడాకులు ఇప్పించాలని ఈయన కోర్టును కోరుకున్నారు. రమ్య కనీసం తనకు తిండి కూడా పెట్టకుండా నిత్యం పార్టీలు పబ్బులు అంటూ తిరిగేదని.. తెలిసిన వారందరి దగ్గర తన పేరు చెప్పి భారీగా అప్పులు చేసిందని నరేష్ తెలిపారు.

Ramya Ragupathi -Naresh: నా ఆస్తి పైనే వ్యామోహం ఎక్కువ…
రమ్య నాపై ప్రేమతో కాదు నా ఆస్తిపై ప్రేమతోనే ఇదంతా చేస్తుందని తనకు డబ్బే ముఖ్యమని నరేష్ తెలిపారు. అలాగే 10 లక్షల రూపాయలు ఇస్తే తాను సెటిల్మెంట్ కి వస్తానంటూ మధ్యవర్తితో మాట్లాడినటువంటి ఆడియో కాల్ తన వద్ద ఉందని ఈ సందర్భంగా నరేష్ రమ్య గురించి తెలియజేశారు. మొత్తానికి నరేష్ రమ్య గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.