రానా విరాట పర్వం గాసిప్ పై స్పందించిన బళ్లాల దేవుడు .. ట్వీట్ వైరల్..!

0
518

బళ్లాల దేవుడు రానా, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం “విరాటపర్వం”. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. తాజాగా సాయి పల్లవి నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది.

ఇకపోతే సాయి పల్లవి రానా నటించిన విరాట పర్వం సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ ఉండడంతో అభిమానుల సినిమా పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా ఈ సినిమా గురించి పలు పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సోషల్ మీడియా వేదికగా ఇన్ సైడ్ టాక్ అంటూ సినిమా గురించి లేనిపోని వార్తలు రాస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్తలపై ఆయన స్పందించారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఇన్ సైడ్ టాక్ విరాట పర్వం నుంచి సంగీత దర్శకుడు తప్పుకున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ట్వీట్ పై స్పందిస్తూ రీ ట్వీట్ చేశాడు.

ఈ క్రమంలోనే రానా స్పందిస్తూ “ఎవడు బ్రో నీకు చెప్పింది.. నీ సోది” అంటూ రానా గట్టిగా కౌంటర్‌ వేయడంతో సదరు నెటిజన్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అయ్యి వెంటనే తాను చేసిన పోస్ట్ డిలీట్ చేశారు. ప్రస్తుతం రానా చేసిన రీట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల గురించి వస్తున్న ఈ విధమైనటువంటి వార్తలపై స్వయాన వారే స్పందించడం గమనార్హం.