Hero Venkat: ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పలు సినిమాలలో హీరోగా నటించి అందరిని మెప్పించిన నటుడు హీరో వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా రోజుల తర్వాత ఈయన తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకట్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో వెంకట్ కు రవితేజను చూస్తే మీకేమనిపిస్తుంది అనే ప్రశ్న ఎదురయింది.రవితేజ వెంకట్ ఇద్దరూ కలిసి మెగాస్టార్ చిరంజీవి నటించిన అన్నయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడు పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.

ఇలా తమ్ముళ్ల పాత్రలో నటించిన తర్వాత రవితేజ హీరోగా అవకాశాలను సంపాదించుకొని ప్రస్తుతం స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇక ఈ ప్రశ్నకు వెంకట్ సమాధానం చెబుతూ.. ఇప్పటికి రవితేజ సినిమాలు చూస్తుంటాను. రవితేజ అలా స్టార్ హీరోగా మారిపోవడం చాలా హ్యాపీగా ఉందని తెలిపారు.
ఆ ప్రమాదం వల్లే ఇండస్ట్రీకి దూరం..
ఇక తనకి కూడా పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు వచ్చాయని కానీ తనకు ఒక సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరగడం వెన్నెముకకు గాయం తగలడం వల్ల పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయ్యానని ఇలా ఇండస్ట్రీకి దూరమైనప్పుడు తను బిజినెస్ చేస్తూ వచ్చానని ఈ సందర్భంగా వెంకట్ తెలిపారు. అవకాశాలు రాక నేను ఇండస్ట్రీకి దూరం కాలేదని చాలా మంచి అవకాశాలు వస్తున్నప్పటికీ నేనే ఇండస్ట్రీకి దూరమయ్యానని తెలిపారు.