ఇప్పుడిప్పుడే కరోనా రెండవ దశ అయిన డెల్టా వేరియంట్ నుంచి దేశం కోలుకుంటోంది. ఈ క్రమంలోనే డెల్టా ప్లస్ వేరియంట్ కలవరపెడుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు 40 నమోదు కాగా ఇందులో మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళ మృత్యువాత పడింది. దీంతో అధికారులు డెల్టా ప్లస్ వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డెల్టా ప్లస్ వేరియంట్ రెండవదశ కన్నా ఎంతో సమర్థవంతమైనదని, ఈ వేరియంట్ కి తొందరగా వ్యాప్తి చెందే గుణం ఉందని, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే డెల్టా ప్లస్ వేరియంట్లను అదుపు చేయాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని. డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వారి పక్క నుంచి మాస్కులు లేకుండా వెళ్లిన ఆ వైరస్ మనకు వ్యాపించే అవకాశం ఉందని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా ఇటీవల వెల్లడించారు.
ఇప్పటివరకు డెల్టా ప్లస్ వేరియంట్ సోకినవారిలో మృతి చెందిన మహిళ ఇప్పటివరకు ఎలాంటి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి లేదని అధికారులు తెలియజేశారు. అందుకోసమే ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలని, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం, శానిటైజర్ లు వాడటం, భౌతిక దూరం పాటించడం ఎంతో ముఖ్యమని నిపుణులు తెలియజేస్తున్నారు.
డెల్టా వేరియంట్ కన్నా డెల్టా ప్లస్ వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదని అందుకోసమే దీనిని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తొందరపడి లాక్ డౌన్ సడలించవద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విధమైనటువంటి డెల్టా ప్లస్ వేరియంట్ ను అధికారులు మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ లో గుర్తించినట్టు తెలిపారు. డెల్టా వేరియంట్ లోని స్పైక్ ప్రొటీన్‌లో ‘కే417’ జన్యు మార్పు జరిగి కొత్త వేరియంట్ పుట్టిందని నిపుణులు తెలియజేస్తున్నారు.