దేశంలో చాలామంది విద్యార్థులకు ప్రతిభ ఉన్నా ఉన్నత చదువులు చదవటానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రతిభ ఉన్న విద్యార్థులకు ప్రోత్సహించేందుకు పలు సంస్థలు, యూనివర్సిటీలు, కాలేజీలు ఫెలోషిప్స్ ను అందజేస్తున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (kvpy) ద్వారా డిగ్రీ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తోంది.

కేంద్రంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంపికైన విద్యార్థులకు ఫెలోషిప్స్ ను అందిస్తుంది. http://kvpy.iisc.ernet.in వెబ్ సైట్ ద్వారా ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నెల 30 వరకు విద్యార్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా వేల సంఖ్యలో విద్యార్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం అందుతోంది.

గతంలో తక్కువ రోజులే దరఖాస్తుకు అనుమతి ఇవ్వగా తాజాగా ఆ గడువు ఈ నెలాఖరు వరకు పొడిగించారు. అయితే ఈ ఫెలోషిప్ కు అర్హత పొందడానికి కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. http://kvpy.iisc.ernet.in/ వెబ్ సైట్ లో ఈ ఫెలోషిప్ కు సంబంధించిన అర్హత ప్రకటన ఉంటుంది. ఈ అర్హత ప్రకటన చదివి అర్హత ఉంటే మాత్రమే విద్యార్థులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఫెలోషిప్ కు దరఖాస్తు చేయాలంటే అన్ని వివరాలను నమోదు చేయడంతో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ తో పాటు ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ కోర్సులు చదువుతున్న వారు అర్హులు. 2021 జనవరి 31న ఆన్‌లైన్ యాప్టిట్యూట్ టెస్ట్‌ నిర్వహించి ఎంపిక చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here