తెలంగాణ మందుబాబులపై షాకింగ్ కామెంట్స్ చేసిన ‘సింగర్ సునీత’..!!

0
35

కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా విజృంభిస్తోన్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల పాటు లాక్ డౌన్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇక ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించగానే హైదరాబాద్ జిల్లాల్లో వైన్స్ షాపులకు పోటెత్తారు. ఏమాత్రం కరోనా భయం లేకుండా మద్యం కోసం ఎగబడ్డారు. నిజానికి అందరూ కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం తాపత్రయపడుతారని అనుకున్నాం.

కానీ మందుబాబులు మాత్రం ఒక్కరోజులోనే షాపులు ఖాళీ చేసేంతగా మద్యాన్ని కొనేశారని తెలిసి అందరూ విస్తుపోయారు.ఎన్ని కరోనా వైరస్ లు వచ్చినా.. ఎంత తీవ్రంగా ఉన్నా మందుబాబుల ఆ దాహం మాత్రం తీరడం లేదు. మద్యం కోసం వారంతా ఎగబడుతూనే ఉన్నారు. పోయిన సారి కరోనా మొదటి వేవ్ లాక్ డౌన్ లో మద్యం షాపుల మూతతో ఎంత ఇబ్బంది అయ్యిందో అందరూ చూశారు.

మద్యం దొరక్క చాలా మంది మందుబాబులకు పిచ్చెక్కింది.అందుకే కేసీఆర్ ఇలా లాక్ డౌన్ అనడగానే అలా వైన్స్ షాపులపై పడిపోయి సంచుల్లో మద్యాన్ని కొని తీసుకెళ్లిన దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి.వీటిని చూసి తాజాగా ప్రముఖ సింగర్ సునీత కూడా హాట్ కామెంట్స్ చేసింది. ఇలాంటి క్లిష్ట సమయంలో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే సేఫ్ గా ఉండాల్సింది పోయి ఇలా మద్యం కోసం ఎగబడడం ఏంటి అని ప్రశ్నించారు.

లాక్ డౌన్ అనగగానే కిరాణా సామాగ్రి కోసం జనం షాపుల ముందు క్యూ కడుతారని అనుకున్నారని.. కానీ మద్యం కోసం వైన్ షాపుల ముందు క్యూ కట్టడం తాను ఊహించలేదన్నారు. నిజంగా ఇది దురదృష్టకర అంశమని పేర్కొన్నారు.ఇలా మద్యం కోసం తెలంగాణలో మందుబాబు ఎగబడ్డ తీరుపై మేధావులు, సినీ సెలెబ్రెటీలు, ఇతరులు కూడా షాక్ అవుతున్నారు.. ఈ నేపథ్యంలో సింగర్ సునీత.. మందుబాబులపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here