దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ప్రజలు తీవ్ర ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆదాయం పెంచుకోవడానికి అనేక రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. వలస కూలీలు, పేదలపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. అయితే కేంద్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి శుభవార్త చెప్పింది. వాళ్లకు జన్ ధన్ ఖాతా ఉంటే 5,000 రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తోంది.

జన్ ధన్ అకౌంట్ లేని వాళ్లు ఈ సౌకర్యాన్ని పొందాలని భావిస్తే కొత్తగా జన్ ధన్ అకౌంట్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అయితే జన్ ధన్ ఖాతాను కలిగి ఉన్న వారు ఆ ఖాతాకు ఆధార్ నంబర్ ను లింక్ చేసి ఉంటే మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని పొందవచ్చు. జన్ ధన్ ఖాతా అంటే ప్రజలు ఎవరైనా సమీపంలోని బ్యాంక్ లేదా పోస్టాఫీస్ కు వెళ్లి సున్నా బ్యాలెన్స్ తో అకౌంట్ ను సులభంగా ఓపెన్ చేయవచ్చు.

2014 ఆగష్టు 28వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలనే ఉద్దేశంతో జన్ ధన్ యోజన స్కీమ్ ను ప్రవేశపెట్టారు. బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేకపోయినా అప్పుగా ఈ డబ్బును తీసుకోవచ్చు. ఈ అప్పును మళ్లీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే జన్ ధన్ యోజన ఖాతా ద్వారా 5,000 రూపాయలు పొందాలంటే కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి.

గడిచిన ఆరు నెలల నుంచి జన్ ధన్ అకౌంట్ యాక్టివ్ గా ఉంటే మాత్రమే 5,000 రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం లభిస్తుంది. జన్ ధన్ ఖాతా ఓపెన్ చేసిన వారికి రూపే డెబిట్ కార్డ్ లభిస్తుంది. కేంద్రం జన్ ధన్ ఖాతాలకు లక్ష రూపాయల ఫ్రీ ఇన్సూరెన్స్ సౌకర్యం అందిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here