ఎంతో మంది మహిళలకు స్పూర్తి యాంకర్ సుమ.. దగ్గుపాటి రానా..!

0
570

బుల్లితెర స్టార్ యాంకర్ సుమ తొలిసారిగా సిల్వర్ స్క్రీన్ లో లీడ్ రోల్ లో కనిపించనుంది. జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా తన నటనను వెండితెరపై చూపించనుంది. సుమ భర్త రాజీవ్ కనకాల ఎప్పటి నుంచో సినిమాల్లో నటిస్తున్నా.. సుమ మాత్రం ఇప్పటి వరకు బుల్లి తెరకే పరిమితమైంది.

తన వాక్చాతుర్యంతో స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. సుమ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను విజయ్ కుమార్ కలివారపు దర్శకత్వంలో బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఆమె నటించిన చిత్రం జయమ్మ పంచాయతీ టీజర్ అందరిని ఆకట్టుకునేలా ఉంది.

ఈ చిత్రం టీజర్ ను రానా ఆదివారం విడుదల చేశారు. సుమగారు నటించిన జయమ్మ పంచాయతీ పెద్ద హిట్ కావాలిని ఆయన కోరుకున్నారు. ఇలాగే సినిమాలు, షోలు చేస్తూ.. మరిన్ని భాషల్లో నటించాలని ఆయన అన్నారు. సుమ ఎందరో మహిళలకు స్పూర్తి అంటూ చెప్పుకొచ్చాడు. సుమ మాట్లాడుతూ… ఈ సినిమా కోసం శ్రీకాకుళం యాస నేర్చుకున్నానని తెలిపారు. ఇదో విభిన్న కథా చిత్రమని ఆమె వెల్లడించారు.

ఈ సినిమాకు 18 రోజులు పనిచేయాలనుకున్నా… 40 రోజులు పనిచేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. కీరవాణి ఒక్క ఫోన్ కాల్ తోనే సినిమాకు మ్యూజిక్ అందిచారని ఆయనకు థాంక్స్ చెప్పింది. ఇక డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. సుమ గారిని విధే పరిచయం చేసిందన్నారు. ఈ సినిమా ఆమె వల్లే జరుగుతుందని వెల్లడించారు. ఈ సినిమా తర్వాత సుమను అంతా జయమ్మగా పిలుస్తారనన్నారు.