కరోనాను చంపే స్ప్రే.. ఎలా పనిచేస్తుందంటే?

0
157

దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశవ్యాపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కేసుల సంఖ్య లక్షలలో నమోదు కాగా మరణాల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ వైరస్ ను అరికట్టడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ వైరస్ ను మరింత వేగంగా అరికట్టడం కోసం పరిశోధకులు మరిన్ని ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం మన దేశంలో టీకా ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయటం కోసం ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అయితే వ్యాక్సిన్ రూపంలో కాకుండా స్ప్రే ద్వారా కూడా ఈ మహమ్మారిని అరికట్టవచ్చని కెనడాకు చెందిన సానోటైజ్ సమస్థ సరికొత్త మందును కనిపెట్టింది. సార్స్- కోవిడ్ 19 ను ఎదుర్కోవడంలో ఈ స్ప్రే ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది.

కరోనా వైరస్ నోరు లేదా ముక్కు ద్వారా మన శరీరం లోపలికి ప్రవేశించి ఊపిరితిత్తులను చేరుతుంది. ఈ వైరస్ ముక్కులో నుంచి ఊపిరితిత్తులలోకి వెళ్లకుండా ముక్కు రంధ్రాలలోనే వైరస్ ను చంపే స్ప్రే ను ఇప్పటికే కెనడా దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి పొందినట్లు తెలిపింది. ఈ స్ప్రే ద్వారా 95 శాతం వైరస్ నుంచి రక్షణ పొందవచ్చు.

ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో ఈ స్ప్రే ఎంతో ప్రయోజనకరమని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే భారత భాగ్య స్వామ్యం కోసం తమ సమస్థ ఎదురు చూస్తోందని, త్వరలోనే ఈ స్ప్రే ను భారత మార్కెట్లోకి తీసుకురానుందని కెనడాకు చెందిన సానోటైజ్ సమస్థ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here