మన పెద్దలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెబుతూ ఉంటారు. ప్రస్తుతం పాత వస్తువులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. మనం ఎందుకూ పనికిరావని వాడి పాడేసిన వస్తువులు, కాయిన్లు, పాత నోట్లు ఇప్పుడు లక్షల రూపాయలు పలుకుకుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పాత నాణేలు, నోట్లు లక్ష రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు ఆన్ లైన్ లో వేలానికి ఉంచిన ఘటనల గురించి విన్నాం.
తాజాగా నోకియా 3300 మోడల్ పాత ఫోన్ కూడా లక్షల రూపాయలు పలుకుతోందని తెలుస్తోంది. చాలామంది ఇళ్లలో ఇప్పటికీ పాతతరం ఫోన్లతో పాటు పాత ఎలక్త్రానిక్ వస్తువులు ఉంటాయి. ఆన్ లైన్ లో కొన్ని సంస్థలు ప్రజలకు పాత వస్తువులను వేలం వేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మన దేశంతో పాటు ఇతర దేశాలకు చెందిన వాళ్లు పాత వస్తువులపై ఇష్టం చూపుతూ వాటిని మనం కొన్న వెలకు వందల రెట్లు ఎక్కువ మొత్తం చెల్లించి కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.
నోకియా 3310 మోడల్ తో పాటు తొలి తరం ఫోన్లు మీ దగ్గర ఉంటే ఆన్ లైన్ లో ఉంచి సులువుగా డబ్బులు సంపాదించవచ్చు. కొందరు పాత వస్తువులను సేకరించి వాటి ద్వారా లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ప్రొడక్షన్ లో లేని కంపెనీల ఉత్పత్తులకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది.
మరోవైపు పాత కాయిన్లతో పాటు, 786 సిరీస్ ఉన్న పాత నోట్లు కూడా మార్కెట్ లో లక్షలు పలుకుతుండటం గమనార్హం. అయితే కొన్ని జెన్యూన్ వెబ్ సైట్ల ద్వారా మాత్రమే క్రయవిక్రయాలు చేయాలి. లేకపోతే మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి.