నవరాత్రి.. అమ్మవారిని తొలి రోజు ఇలా పూజించండి..!

0
340

దసరా పండుగ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ నవరాత్రులు పూజలు చేస్తారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రకాల పేర్లతో అలంకరించి.. భిన్న రకాల ఫలహారాలను తయారు చేసి నైవేద్యంగా పెడతారు. ఈ నవరాత్రులు 2021 అక్టోబర్‌ 7 నుంచి ప్రారంభమై 15న ముగుస్తుంది. బతుకమ్మలను మొదటి రోజును ఎంగిలి పూల బతుకమ్మ అంటారు.

ఆ రోజు మహా బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. రంగు రంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు అనే పాటలను పాడతారు.

బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మతో మొదటి రోజు మొదలవుతుంది. ఇలా 9 రాత్రుళ్లు పూజలు చేస్తారు. అయితే ఇక్కడ కనకదుర్గ అమ్మవారిని కూడా ఒక్కో రోజు .. ఒక్కో రూపంలో పూజిస్తారు. అయితే మొదటి రోజును అమ్మవారిని రెండేళ్ల చిన్నారిగా పూజిస్తారు. అంటే మొదటిరోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో దర్శనమిస్తుంది. పాడ్యమి రోజు ఈ అమ్మవారికి విశేష పూజలు చేస్తారు.

పొంగల్‌ ను నైవేద్యంగా పెడతారు. ఈరోజు అమ్మవారిని పూజిస్తే.. శత్రువు, రుణ సమస్యలు తగ్గిపోతాయి. పూజ చేసేముందు కచ్చితంగా అఖండ దీపం వెలిగించుకోవాలి. తొలి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలనూ, యశస్సునూ అందిస్తుంది.