ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీ ఎప్పుడంటే..?

0
300

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలో నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతోంది. పాఠశాల విద్యాశాఖ త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలిపోయిన ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందుకోసం త్వరలో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా పరీక్షల నిర్వహణ కోసం జగన్ సర్కార్ ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల్లో 403 పోస్టులు ఉన్నట్టు తెలుస్తోంది.

పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే జిల్లాలవారీగా ఖాళీలకు సంబంధించిన వివరాలను సేకరిస్తుండగా త్వరలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం రాష్ట్రంలో వేల సంఖ్యలో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అధికారులు త్వరలో టెట్ పరీక్ష కూడా నిర్వహించనున్నారని.. టెట్ నిర్వహణ కొరకు అధికారులు కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది.

టెట్ పరీక్ష నిర్వహణ కోసం పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారని.. రాష్ట్ర విద్య ప‌రిశోధ‌న‌, శిక్ష‌ణ మండ‌లి ఈ సంవత్సరం పాఠ్య ప్రణాళికలో మార్పులు చేయనుందని.. ఎన్‌సీఈఆర్‌టీ ఈ బాధ్యతలను తీసుకుందని సమాచారం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటూ ఉండటంతో పరీక్షల్లో కూడా ఆ మేరకు మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది.

ఉపాధ్యాయ బ‌దిలీల ప్ర‌క్రియ అనంతరం టెట్ పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయని.. త్వరలో టెట్, డీఎస్సీల గురించి విద్యాశాఖ అధికారుల నుంచి ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది.