టాఫిక్ పోలీసులు, రవాణాశాఖ అధికారులు ద్విచక్ర వాహనాలపై వెళ్లే వాహనదారులకు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచనలు చేస్తుంటారు. అయితే హెల్మెట్ ను కొనుగోలు చేసేవాళ్లు బ్రాండెడ్ కంపెనీల హెల్మెట్లను దుకాణాల ద్వారా, ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేస్తే మంచిది. రోడ్లపై, అపరిచిత వ్యక్తుల నుంచి హెల్మెట్లను కొనుగోలు చేస్తే మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.


సైబరాబాద్ పోలీసులు తాజాగా నకిలీ హెల్మెట్లు తయారు చేసే ముఠాను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ హెల్మెట్ల తయారీ జరుగుతోందని యూపీ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు ఆ హెల్మెట్ల సరఫరా జరుగుతుందని అధికారులు గుర్తించారు. నాసిరకం హెల్మెట్లను వినియోగించడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో తలకు గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

నాణ్యత లేని హెల్మెట్లు ధరించడం, హెల్మెట్లు ధరించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువమంది మృతి చెందుతున్నారని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 80 మంది వాహనదారులు నకిలీ హెల్మెట్ ను ధరించడం వల్ల ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడిస్తున్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు నకిలీ హెల్మెట్లపై isi మార్క్ వేసి విక్రయిస్తున్నారని చెబుతున్నారు.

ప్లాస్టిక్, ఫైబర్, థర్మాకోల్ తో ప్లాస్టిక్ హెల్మెట్లు తయారవుతున్నాయని తెలుస్తోంది. నకిలీ హెల్మెట్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు 100 రూపాయలుగా ఉంటే మార్కెట్ లో 500 రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తానికి ఈ హెల్మెట్లను విక్రయిస్తున్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here