ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై గ్యాస్ సిలిండర్ వినియోగదారులు సిలిండర్ కోసం బుకింగ్ చేసుకున్న అరగంటలోనే సిలిండర్ ను పొందే అవకాశం ఉంటుంది. తత్కాల్ ఎల్‌పీజీ సేవలను అందించటానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకున్న రోజు నుంచి మూడు రోజుల్లో డెలివరీ అవుతుంది.

ఇకపై గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకున్న తరువాత 30 నిమిషాల నుంచి 45 నిమిషాల్లో సిలిండర్ ను డెలివరీ చేస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చెబుతోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడంతో గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మొదట ప్రతి రాష్ట్రంలో ఒక నగరం లేదా జిల్లాను తాత్కాల్ ఎల్పీజీ సేవల ప్రారంభం కోసం గుర్తించనుంది.

ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఐఓసీ ఇండేన్ బ్రాండ్ ద్వారా గ్యాస్ సిలిండర్ల డెలివరీ చేయనుండగా దేశంలో ఇండేన్ కంపెనీకి 14 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. దేశంలోని సింగిల్ సిలిండర్ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్టు తెలుస్తోంది. తత్కాల్ ఎల్పీజీ సేవల వల్ల సిలిండర్ బుకింగ్ చేసుకున్న రోజే ఇంటికి వచ్చే అవకాశం ఉంది.

భవిష్యత్తులో ఇతర గ్యాస్ సిలిండర్ కంపెనీలు సైతం ఈ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. గ్యాస్ సిలిండర్ కంపెనీలు తత్కాల్ ఎల్పీజీ సేవల దిశగా అడుగులు వేస్తుండటంపై గ్యాస్ సిలిండర్ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here