Jr.Ntr: తారకరత్నకు గుండెపోటు.. బాలయ్యకు ఫోన్ చేసిన ఎన్టీఆర్!

0
194

Jr.Ntr: తాజాగా నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ తో పాటు నందమూరి తారకరత్న కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం కుప్పం మసీదు కు చేరుకొని అక్కడ ప్రార్థనలు ముగిసిన తర్వాత అక్కడి నుండి బయటికి వస్తుండగా తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. దీంతో వెంటనే ఆయనని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స చేశారు.

ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన్ని పరీక్షించి గుండెపోటు రావటం వల్ల ఇలా జరిగిందని వెల్లడించారు. గుండెపోటు రావడం వల్ల ఆయన శరీరం నీలం రంగులోకి మారిపోయి దాదాపు 45 నిమిషాల పాటు పల్స్ రేట్ పడిపోయిందని డాక్టర్లు వెల్లడించారు. ఆ ఆయనకు యాంజీయోప్లాస్ట్‌ నిర్వహించారు. ఇదిలా ఉండగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి జూనియర్ ఎన్టీఆర్ ఆరా తీశాడు.

తారకరత్న అనారోగ్యం గురించి తెలిసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఒక్క సారిగా షాక్ అయ్యాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన సోదరుడైన తారకరత్న వద్దకు వెళ్ళి పరామర్శించడానికి కుదరకపోవడంతో బాలకృష్ణకు ఫోన్ చేసినట్లు సమాచారం. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవటానికి జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణకు ఫోన్ చేశారట.

Jr.Ntr: నిలకడగ తారక్ రత్న ఆరోగ్యం…

తారకరత్న ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, అతని ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలకృష్ణ వెల్లడించాడు. అయితే మెరుగైన వైద్యం కోసం తారకరత్నని బెంగళూరు ఆసుపత్రికి తరలించనున్నట్లు బాలకృష్ణ వెల్లడించాడు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ఆ తర్వాత తన సోదరుడు వరుసగా మృతి చెందటంతో నందమూరి కుటుంబంలో వారు లేని లోటు ఇప్పటికీ స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో నందమూరి తారకరత్న ఇలా అకస్మాత్తుగా అనారోగ్యం పాలవటంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు.