జూలై 15 వ ఎపిసోడ్: నీకు పెళ్లి కావాలా… జైలు కావాలా.. తేల్చుకో?

0
973

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎంతో రసవత్తరంగా కొనసాగుతోంది. గత ఎపిసోడ్లో ఇంటరాగేషన్ పేరిట ఏసిపి దీప ఇంటికి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం మోనిత రోషిణిని కలుస్తుంది. ఈ క్రమంలోనే రోషిణిని తప్పు చేశానన్న ఫీలింగ్ కార్తీక్ లో అస్సలు కనిపించడం లేదు. ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ గా ఉంది.అయినా నీ కడుపులో బిడ్డ పెరుగుతుంది కనుక తప్పకుండా న్యాయం చేస్తానని రోషిణిని చెబుతుంది. ఎవరి వైపు తప్పు ఉంటే వాళ్లకు శిక్షపడేలా చేస్తాను ఈ విషయం నాకు వదిలిపెట్టు అని చెప్పగా మోనిత మనసులో ఈమె నాకన్నా తేడాగా ఉంది. నాకు సహాయం చేస్తుందా లేదా వారికి చేస్తుందా అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

అదే సమయానికి కార్తీక్ తన తండ్రి తిరిగి వస్తున్నాడు అని ఆలోచిస్తూ బాధగా కూర్చుంటాడు. అప్పుడు దీపా భోజనం చేద్దురు రండీ అంటుంది. కార్తీక్ బాధగా.. తండ్రి వస్తున్నాడు ఈ విషయాలన్నీతెలిస్తే బాధపడతాడు అంటుండగా దీప ఇక్కడ జరిగిన విషయాలు ఏవి మామయ్యకు చెప్పవద్దు. ఇక్కడ హాస్పిటల్ పెట్టడం వల్లే అందరం కలిసి ఇక్కడే ఉన్నామని చెప్పండి అంటుంది. రేపు పొద్దున్నే మీరు పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళండి… నాకు కొంచెం పని ఉంది అది చూసుకొని మామయ్య వచ్చేలోపు నేను అక్కడికి వస్తాను అంటుంది దీప. దీంతో కార్తీక్ రేపంతా ముఖ్యమైన పని ఏమిటి అని అడుగగా… వెళ్లొచ్చాక మీకే తెలుస్తుంది అని చెబుతుంది.

ఇక ఉదయాన్నే ఆదిత్య తన తండ్రిని తీసుకురావడానికి వెళ్తూ బాధగా కనిపించడంతో శ్రావ్య ఏం జరిగిందని అడుగుతుంది. దీంతో వదిన ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయాన్ని నాన్నకు చెప్పవద్దని అంది.. ఎందుకో అర్థం కావట్లేదని బాధపడతాడు. శ్రావ్య కూడా అదే ఆలోచిస్తూ అన్యాయం జరుగుతుంటే చెప్పొద్దనడం ఏంటి అంటూ అనుకుంటుంది. ఈ సమయంలోనే ఏసీపీ రోషిణీ ముందు ప్రియమణి గజగజా వణుకుతూ.. నిలబడుతుంది. ‘నాకు నిజం చెప్పని వారిని కొట్టడానికి ఇద్దరిని ఉద్యోగంలో పెట్టుకున్నాను. ఈమధ్య వారికి పని లేక అన్ని పగలు కొడుతున్నారు. నేను వాళ్లకి మాటిచ్చాను. నువ్వు నాకు నిజం చెప్పలేదు అనిపిస్తే నేను వాళ్లకు నిన్ను ఇస్తాను అంటుంది రోషిణీ. అప్పుడు ప్రియమణి మీరు ఏం అడిగితే అది చెప్తాను అంటూ ఆమె కాళ్ళ పై పడుతుంది.

అప్పుడు రోషిణీ అయితే ఆ రూంలోకి వెళ్లి వెయిట్ చెయ్ ఎవరికి ఫోన్ చేయకు అని చెప్పి సీసీ కెమెరాలు ఉన్న రూమ్ లోకి పంపిస్తుంది. అయితే అక్కడ కెమెరాలు ఉన్న విషయం ప్రియమణికి తెలియక నిజం చెబితే ఆ అమ్మ చంపుతుంది. చెప్పకపోతే ఈ అమ్మ చంపుతుంది అని కంగారు పడుతూ అర్జెంట్‌గా మోనితమ్మకి ఫోన్ చేసి.. నన్ను ఈవిడ తీసుకొచ్చి పడేసిందని మోనితమ్మకి చెప్పి.. ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కనుక్కుని ఇక్కడ చెబుతా… అయినా మోనిత మించిన కిలాడి ఎవరుంటారు ?అని ఫోన్ నొక్కుతూ లాఠీలు చూసి ఆగి పోతుంది. అయితే ఆ రూమ్ లో ప్రియమణి మాట్లాడే మాటలు అన్ని బయట రోషిణీ వింటుంది.

మరోవైపు ప్రియమణి ఎక్కడికివెళ్ళింది అనుకుంటూ మోనిత కంగారుగా అటూ ఇటూ తిరుగుతోంది. ఈ క్రమంలోనే భాగ్యం మెట్లెక్కుతూ రావడం చూసిన మోనిత ఏయ్ ఆగు అక్కడే.. పైకి వచ్చేస్తావేంటీ.. వెళ్లు’ అని మోనిత కసరడంతో భాగ్యం వెనక్కి వెళ్తుంది. అయితే ఈ సారీస్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లతో వంటలక్క ఎంట్రీ ఇస్తూ అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ నీ తన్ని మోనిత కి షాక్ ఇస్తుంది. ఇలా ఎంట్రీ ఇచ్చిన దీప కంప్లైంట్ ఇచ్చావా? మా పరువు తీసేద్దాం అనుకుంటున్నావా? అని నిలదీయడంతో మోనిత పొగరుగా అవును పరువు తీసేస్తా’ అంటూ పొగరుగా మాట్లాడటంతో.. మన వంటలక్క మోనిత ముందే సోఫాలో కాలుపై కాలు వేసుకుని దర్జాగా కూర్చుని కళ్ళు పెద్దవి చేసి చూడటంతో మౌనిక షాక్ అవుతుంది.

ఇప్పుడు దీపం మాట్లాడుతూ ఈ కడుపు సంగతి, 25వ తారీకు పెళ్లి సంగతి పక్కన పెట్టు. నీకు దుర్గా గుర్తున్నాడా… అంజి కూడా గుర్తున్నాడా.. అనగానే మోనితలో కంగారు, భయం కనిపిస్తాయి. గతంలో వారు చేసిన పనులు అన్ని గుర్తుకు వస్తాయి. ఏసీపీ గారి ముందు వాళ్లిద్దరినీ హాజరుపరిచాక అప్పుడు మాట్లాడుకుందాం..’ అని దీప అనడంతో మోనిత ముఖంలో రంగులు మారిపోయి హిమను చంపడం కార్తీక్ కి యాక్సిడెంట్ చేయించిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. దీపా పైకి లేచి 25తారీఖుని రెడ్ స్కెచ్‌తో సర్కిల్ వేసి చూపిస్తూ.. ‘ఇదే.. ఇదే 25 తేదీ.. నీకు పెళ్లి కావాలా? జైలు కావాలా తేల్చుకో..’ అని దీప అనడంతో
మోనిత తల తిరుగుతుంది. అక్కడే ఉన్న భాగ్యం మెల్లిగా పెళ్లా..జైలా?’ అని నెమ్మదిగా చెవిలో చెబుతున్నట్లుగా అడుగుతుంది.దీప నవ్వుతూ.. ‘మ్చీ.. పడిపోయేలా ఉంది..’ అంటుంది. మోనిత నిజంగానే కళ్లు తిరిగి పడేలా కనిపిస్తోంది. తరువాత ఏం జరుగుతుందో తరువాయి ఎపిసోడ్ వరకు వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here