Koti: వద్దురా విడిపోవద్దు అన్నాడు… మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మరణం పై ఎమోషనల్ అయిన కోటి!

0
27

Koti: ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా సంగీత దర్శకుడుగా ఎన్నో అద్భుతమైన సినిమాలను పాటలను ప్రేక్షకులకు అందించిన రాజ్ వరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి అయితే రాజ్ కోటి ఈ ఇద్దరు పేర్లను విడదీయడం చాలా కష్టం. చిన్నప్పటినుంచి ఎంతో మంచి స్నేహితులుగా ఉన్నటువంటి వీరిద్దరూ దాదాపు 180 సినిమాలకు కలిసే సంగీతమందించారు.

ఇలా వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నింటికీ రాజ్ కోటి సంగీతం అని రాజ్ కోటి పాటలంటూ పేర్లు పెట్టేవారు. ఇలా రాజ్ కోటి కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయి అయితే కొన్ని పరిస్థితుల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఇలా ఇద్దరు విడిపోయిన కూడా కోటి గారి నుంచి వచ్చే పాటలను రాజ్ కోటి పాటలు గానే పిలిచేవారనీ తాజాగా కోటి రాజ్ మరణ వార్త తెలుసుకొని ఎమోషనల్ అవుతూ కామెంట్ చేశారు.

ఈ క్రమంలోనే రాజ్ మరణ వార్త పై కోటి స్పందిస్తూ ఇప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నానని కోటి తెలిపారు.నా రాజ్ చనిపోయారన్న వార్త నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఇటీవల కాలంలో ఒక ఫంక్షన్ లో కలిసాము ఆయన అనారోగ్యంతో ఉన్నట్టు నాకు అసలు అనిపించలేదు రాజు కూడా చెప్పలేదని ఆయన మరణ వార్తను తలుచుకొని కోటి ఎమోషనల్ అయ్యారు.

Koti: పాటల రూపంలో కలిసే ఉంటాం….

చక్రవర్తి వద్ద మేమిద్దరం అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తామని అయితే ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీతం అందించిన మేమిద్దరం పరిస్థితుల కారణంగా విడిపోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే నేను విడిపోయే సమయంలో రాజు వద్దురా విడిపోవద్దు అని బ్రతిమలాడారు. అయితే పరిస్థితులు నన్ను వేరు చేశాయని, కానీ వేమిద్దరం పాటల రూపంలో ఎప్పటికీ కలిసి ఉంటాము అంటూ ఈ సందర్భంగా కోటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.