Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో రాబోయే సిరిమ షూటింగ్ పనులలో బిజీ కానున్నారు.

మహేష్ బాబుపుట్టినరోజు సందర్భంగా గుంటూరు కారం నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త ఫైర్ అవుతున్నారు అయితే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్ మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో మహేష్ బాబు నలుపు చొక్కా వేసుకొని లుంగీ కట్టుకొని కూలింగ్ గ్లాసెస్ తో బీడీ తాగుతూ చాలా మాస్ లుక్ లో కనిపిస్తున్నారు.
ఇలా ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరి దృష్టి మహేష్ బాబు ధరించిన షర్టుపై పడింది. ఈ పోస్టర్లో మహేష్ బాబు ధరించిన ఈ షర్ట్ ఖరీదు ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు. మరి ఈ సినిమాలో మహేష్ బాబు ధరించిన ఈ షర్ట్ ఖరీదు ఎంత ఏ బ్రాండ్ కి చెందినది దీని ధర ఎంత అనే విషయానికి వస్తే…

Mahesh Babu: షర్ట్ ఖరీదు అన్ని వేల…
ఈ పోస్టర్ లో మహేష్ బాబు ధరించిన ఈ షర్ట్ ఆర్13 బ్లీచ్ వాష్ ప్లాయిడ్ లాంగ్ స్లీవ్ బ్రాండ్ కు చెందినది ఈ షర్ట్ ఖరీదు అక్షరాల రూ. 74,509 అనే విషయం తెలిసి మహేష్ రేంజ్ కు ఈ మాత్రం ఉండాలని అభిమానులు అంటుంటే. నెటిజన్లు మాత్రం ఆ రేటుకి కోటీలో అలాంటి షర్ట్ లు డబ్బైకి పైగా వస్తాయని సెటైర్లు పేలుస్తున్నారు. మొత్తానికి మహేష్ షార్ట్ కాస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.