ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఉత్తరకొరియా ఎంతో ప్రత్యేకం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఉత్తరకొరియా వైపు చూస్తుంటాయి. ఈ విధంగా ఉత్తర కొరియా ఒక ప్రత్యేకతను చాటుకొని వార్తల్లో నిలవడానికి గల కారణం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అని చెప్పవచ్చు. ఇతను ఒక నియంతలా ఉత్తర కొరియాను పరిపాలించడం అందుకు కారణం. ఈయన తీసుకునే నిర్ణయాల వల్ల ఎప్పుడు వార్తలలో ఉండే కిమ్ ఈసారి భిన్నంగా తన శరీర బరువు తగ్గి ప్రపంచ దృష్టిని తనవైపు ఆకర్షించారు.

కిమ్ అధిక శరీర బరువుతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గతంలో ఎన్నో వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే కొన్ని నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కిమ్ చనిపోయాడనే వార్తలు బలంగా వినిపించాయి. ఈ క్రమంలోనే ఉత్తరకొరియా మీడియా కిమ్ వివిధ అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్న ఫోటోలను విడుదల చేయడంతో ఈ విధమైనటువంటి వార్తలకు చెక్ పెట్టారు.

ఈ క్రమంలోనే ఫిబ్రవరి నెలలో చివరిగా కనిపించిన కిమ్ ఆ తరువాత నాలుగు నెలల కాలం పాటు ఎవరికీ కనిపించలేదు. తాజాగా జూన్ ఆరవ తేదీన కనిపించిన కిమ్ తన శరీర బరువును తగ్గడంతో అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఉన్నఫలంగా ఇతను శరీర బరువు తగ్గడానికి గల కారణాలు ఏమిటని పలువురు సందిగ్దంలో పడ్డారు. కిమ్ఈ విధంగా శరీర బరువు తగ్గడానికి ఏదైనా ఆరోగ్య సమస్య కారణమా లేక ఆరోగ్యంగా ఉండటం కోసం కావాలని శరీర బరువు తగ్గారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

2011 వ సంవత్సరంలో అధికారం చేపట్టిన కిమ్ అప్పటి నుంచి ప్రతి ఏడాది సుమారు ఐదు కిలోల బరువు పెరుగుతూనే ఉన్నారు.ఈ విధంగా అధిక శరీర బరువు పెరగడంతో ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కిమ్ ఉన్నఫలంగా శరీర బరువు తగ్గడంతో ఈ విధమైనటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో అధికారం చేపట్టాలంటే శరీర బరువు తగ్గడం ముఖ్యమని తెలుసుకున్న కిమ్ ఈ విధంగా శరీర బరువును తగ్గారా? అనేది విదేశీ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలుసుకోవాలనుకుంటున్నాయి. ఏది ఏమైనా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఈ విధంగా బరువు తగ్గడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here