Pavitra Lokesh: టార్గెట్ చేయాలంటే సినిమా చేయాల్సిన పని లేదు… పవిత్ర లోకేష్ కామెంట్స్ వైరల్!

0
36

Pavitra Lokesh: సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మళ్ళీ పెళ్లి. విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ నిర్మాతగా ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా మే 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పవిత్ర లోకేష్ ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. మళ్లీ పెళ్లి అనే సినిమా బయోపిక్ చిత్రమా అంటూ ప్రశ్నించగా బయోపిక్ చిత్రం అనేది చాలా పెద్ద వర్డ్ అని, సమాజంలో పెళ్లి పట్ల ఉన్న ఉన్న అభిప్రాయాలను సినిమా ద్వారా తెలియజేస్తున్నామని తెలిపారు.ఇక ఈ సినిమా మీరు ఒకరిపై రివెంజ్ తీర్చుకోవడం కోసమే చేశారు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి అనే ప్రశ్న ఈమెకు ఎదురయింది.

ఈ ప్రశ్నకు పవిత్ర లోకేష్ సమాధానం చెబుతూ ఒకరిపై రివెంజ్ తీర్చుకోవాలి, ఒకరిని టార్గెట్ చేసే ఈ సినిమా చేశాము అనడంలో ఏమాత్రం నిజం లేదని టార్గెట్ చేయాలి అంటే సినిమానే చేయాల్సిన పనిలేదని పవిత్ర లోకేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక నరేష్ గారిలో తనకు నచ్చిన క్వాలిటీస్ గురించి కూడా ఈమె తెలియజేశారు..

Pavitra Lokesh: రేపటి గురించి ఆలోచించరు…


తాను ఏ చిన్న విషయానికైనా తొందరగా కోపంగా రియాక్ట్ అవుతాను కానీ నరేష్ గారు మాత్రం అస్సలు కోపంగా రియాక్ట్ అవ్వరు ఆయన ఈరోజు కోసం మాత్రమే జీవిస్తారు రేపు అనేది వస్తే దాని గురించి ఆలోచించవచ్చు అనే వ్యక్తిత్వం తనదని ఉన్నదాంట్లో ఆయన సంతోషంగా గడుపుతారు ఆ లక్షణం తనకు ఎంతో నచ్చింది అంటూ ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.