Shivabalaji -Madhumitha: టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా గుర్తింపు పొందిన శివ బాలాజీ మధుమిత జంట గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా షూటింగ్ వల్ల వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 2009 లో పెద్దల అంగీకారంతో ఇద్దరు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఇప్పటికీ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఇద్దరూ కూడా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ బిజీగా ఉన్నారు. మధుమిత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వారికి సంబంధించిన అన్ని విషయాలను యూట్యూబ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట వారి ప్రేమ పెళ్లి గురించి అనేక ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నారు.
ఈ క్రమంలో బాలాజీ మాట్లాడుతూ..” వారి ప్రేమను గెలిపించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, మొత్తానికి కుటుంబ సభ్యులను ఒప్పించి ఇద్దరం పెళ్లి చేసుకున్నామని తెలిపాడు. అయితే వివాహం తర్వాత కూడా ఇద్దరి మధ్య గొడవల వల్ల విడాకుల వరకు వెళ్లామని తెలిపాడు.
ఇక మధుమిత మాట్లాడుతూ..” పెళ్లి అనేది చాలా ఈజీ అని అందరూ అనుకుంటారు.అయితే పెళ్లి అనేది అంత సులభం కాదు. పెళ్లైన తరువాత ఏడాదిన్నర పాటు మేమిద్దరం గొడవ పడుతునే ఉండే వాళ్ళమని తెలిపారు.

Shivabalaji -Madhumitha: అభిప్రాయ బేధాలు వచ్చాయి…
పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. వాటి వల్ల ఒకానొక దశలో విడిపోయే స్థితికి వచ్చాము. బాబు పుట్టిన తరువాత కూడా మా మధ్య గొడవలు బాగా జరిగాయి.చివరకు ఇద్దరం విడిపోవాలనుకున్న సమయంలో మా కజిన్ ఒకరు .. కొన్నాళ్లు మీరిద్దరు వేరు వేరుగా ఉండండని సలహా ఇచ్చారు. అలా ఇద్దరం దూరంగా ఉన్న సమయంలో ఒకరిని ఒకరు బాగా మిస్ అయ్యాము. కానీ చివరకు మళ్లీ ఇద్దరు కలిసి పోయాము” అని తెలిపాడు.