టాలీవుడ్ స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ప్రేక్షకులకు ఎప్పటి నుంచో సుపరిచితుడే. అతడితో పాటు ‘దియా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి, ‘వెన్నెల’ రామారావు ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. వీరి ముగ్గురు ఇందులో అంగవైకల్యం కలిగి పాత్రలో నటించారు. ఇటీవల ఇది అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విశేషాధారణ పొందింది.

ట్రైలర్ తోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితం ఓటీటీలో విడుదలయి ప్రేక్షకులను మెప్పిస్తోంది. వీరి ముగ్గురు ఓ మర్డర్ కేసులో ఇరుక్కొని అక్కడ నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు.. అక్కడ పరిణామాలు ఏమి సంభవించాయి.. ఎలాంటి పరిస్థితులను వాళ్లు ఎదుర్కొన్నారు అనేది స్టోరీ. కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన “ముగ్గురు మొనగాళ్లు”లో శ్రీనివాస్ రెడ్డి చెవిటివాడిగా, దీక్షిత్ మూగవాడిగా, రామారావు అంధుడిగా… ఇలా ముగ్గురూ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించారు. రిత్విష్‌శర్మ, శ్వేత వర్మ ఇందులో హీరోయిన్లుగా నటించారు.
రాజా రవీంద్ర క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా ప్రధాన పాత్ర పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి.. సురేష్ బొబ్బిలి స్వరాలు అందించారు. ‘చిత్రమందిర్ స్టూడియోస్’ బ్యానర్ పై పి. అచ్యుత్ రామారావు నిర్మాతగా దీనిని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో నెంబర్ 2 గా ట్రెండ్ అవుతోంది. మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకోవడంతో ఆ చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తోంది. దీనికి గరుడు వేగ మేమ్ అంజి అందించిన విజువల్స్ అమోఘం అని చెప్పుకోవాలి.
దీనిలో ఇంకా.. నిజర్, జెమిని సురేష్, జోష్ రవి, భద్రం, సూర్య, జబర్తస్త్ సన్నీ నటించారు. దీనికి కో ప్రోడ్యూసర్లుగా తేజ చీపురుపల్లి,రవీందర్‌రెడ్డి అద్దుల వ్యవహరించారు. దినిలో బ్యాగ్రౌండ్ స్కోర్ గా చిన్నా, ఎడిటర్ గా బి. నాగేశ్వర రెడ్డి , ఆర్ట్ డైరెక్టర్‌గా నాని పనిచేశారు.