నా బాధను మాటల్లో చెప్పలేకపోతున్న.. కన్నీరు పెట్టుకున్న ఉదయ్ భాను!

0
137

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో మరుగుజ్జు పాత్రలో అద్భుతంగా నటించిన పొట్టి వీరయ్యకు గుండెపోటు రావడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈయన మరణ వార్త తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటుగా ఏర్పడింది.పొట్టి వీరయ్య నాటితరం హీరోల సినిమాలలో ఎన్నో విభిన్న పాత్రల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.

వీరయ్య సొంత జిల్లా నల్గొండ,”అగ్గివీరుడు” సినిమాతో ఆయన తెరంగేట్రం చేశారు. రాధమ్మ పెళ్లి, తాతా మనవడు, టార్జాన్ సుందరి, జగన్మోహిని, పేదరాసి పెద్దమ్మ కథ వంటి సినిమాలలో పొట్టి వీరయ్య ఎన్నో విభిన్న పాత్రల్లో నటించారు. పొట్టి వీరయ్య మరణవార్త తెలియగానే సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పొట్టి వీరయ్య మరణవార్త తెలియడంతో వెంటనే తన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. విఠలాచార్య కాలం నుంచి పలు భాషలలో దాదాపు 500 సినిమాల్లో నటించారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండని నటి, యాంకర్ ఉదయభాను పొట్టి వీరయ్య మరణవార్త తెలియగానే కన్నీరు మున్నీరయ్యారు.

వీరయ్య అంకుల్ మరణం తెలియగానే గుండె ముక్కలయింది. ఇది భరించలేని నిజం.. చెప్పడానికి ఎంతో బాధగా ఉంది నాకు కలుగుతున్న బాధను మాటల్లో చెప్పలేకపోతున్నా మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాం .. ఈ ప్రపంచం ఓ మంచి వ్యక్తిని కోల్పోయింది.. దేవుడా మాపై కొంచెం దయ చూపు అంటూ ఎమోషనల్ అయ్యారు.అదేవిధంగా వీరయ్య మరణం పట్ల సినీ ప్రముఖులు వారి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here