సాధారణంగా ఒక గ్రామం అంటే చిన్న చిన్న ఇల్లు , స్కూలు, హాస్పిటల్స్ అంటూ ఎన్నో ఉంటాయి.ఈ విధంగా ఒక గ్రామం అంటే ఆ గ్రామంలో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయో అన్ని ఇల్లు మనకు కనిపిస్తాయి. కానీ ఈ గ్రామంలో మాత్రం అలాంటివి ఏవీ కనిపించవు. గ్రామం మొత్తం ఒకే బిల్డింగ్ లో నివసిస్తారు. వారికి కావలసిన సౌకర్యాలన్నీ అదే బిల్డింగ్ లో ఉంటాయి. ఇంతకీ ఆ గ్రామం ఏమిటని ఆలోచిస్తున్నారా..ఆ గ్రామం అమెరికాలోని అలస్కాలో ఉంది.

విట్టీర్‌లో గల ఈ అపార్ట్‌మెంట్ సిటీని “బిగిచ్ టవర్స్”అని పిలుస్తారు. ఈ అపార్ట్మెంట్ సముద్ర తీరంలో 14 అంతస్థుల ఎత్తు కలిగి ఉంది. ఇక్కడ సుమారు నూట తొంభై ఆరు కుటుంబాలు నివసిస్తాయి. ఈ అపార్ట్ మెంట్ లోనే వారికి కావాల్సిన హాస్పిటల్, స్కూల్, నిత్యావసర సరుకులు, పోస్ట్ ఆఫీస్ వంటి తదితర సౌకర్యాలు అన్ని ఉన్నాయి. అందుకే ఈ బిల్లింగ్
ను ‘టౌన్ అండర్ వన్ రూఫ్’ అని అంటారు. వాస్తవానికి ఈ పట్టణం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఏర్పడింది. మిలట్రీ హార్బర్ నిర్మాణం కోసం అమెరికా సైన్యం ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.

ఈ 14 అంతస్తుల భవనంలో మూడు విభాగాలుగా విభజించారు. మొదటి భాగంలో ఆ గ్రామ ప్రజలు నివసిస్తే, మిగతా భాగంలో విభాగాల్లో పోస్టాఫీస్, హాస్పిటల్, స్కూల్, జనరల్ స్టోర్, పోలీస్ స్టేషన్, మేయర్ ఆఫీస్ ఉన్నాయి. ఇందులో చిన్న హోటల్, కాన్ఫరెన్స్ రూమ్ కూడా ఉంది. భవనాన్ని అనుకొని ప్లే ఏరియా ఇండోర్ పూల్ కూడా ఉంది.

ఈ భవనం పర్వతాలు అనుకునే ఉండడంతో ఇక్కడ వన్యప్రాణుల భయం ఎక్కువగా ఉండటం చేత ఆ గ్రామ ప్రజలు అందరూ కలిసి ఒకే భవనంలో ఉండటం వల్ల వారికి ఎంతో భద్రత ఉందని భావిస్తారు. అమెరికాకు చాలా దూరంగా ఉండటంతో వీరికి కావలసిన కూరగాయలను వీరే స్వయంగా పండించుకుంటారు. వీటి బాధ్యతను అక్కడ ఉన్న పిల్లలు తీసుకుంటారు. పిల్లల క్రీడా మైదానాలు కూడా ఇండోర్ లోనే ఉన్నాయి. ఈ భవనాన్ని చేరుకోవాలంటే ప్రత్యేక కారిడార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా గ్రామ మొత్తం ఒకే భవనంలో నివసించడం ఎంతో ప్రత్యేకమని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here