Connect with us

Featured

కరోనా ఉన్నా పెళ్లి చేశారు.. ఊరంతా రెడ్ జోన్.. ఎక్కడంటే?

Published

on

దేశవ్యాప్తంగా కరోనా రెండోదశ తీవ్రంగా ఉంది. మొదటి దశ కంటే రెండవ దశలో ఎక్కువగా యువత ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కరోనా బారిన పడినవారు తగినన్ని జాగ్రత్తలు పాటించకపోవడమే కాకుండా వారి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉండటం వల్ల వైరస్ వ్యాప్తి అధికంగా జరుగుతుంది.

తాజాగా ఇలాంటి నిర్లక్ష్యం వల్లే ఓ యువకుడు వల్ల ఏకంగా ఒక గ్రామం మొత్తం రెడ్ జోన్ లోకి వెళ్ళింది. మధ్యప్రదేశ్ లుహుర్‌గువా అనే గ్రామానికి చెందిన అరుణ్ మిశ్రా అనే యువకుడికి ఏప్రిల్ 27 న కరోనా పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది. అయితే ఆ యువకుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక వివాహానికి హాజరయ్యారు. వివాహానికి వెళ్లిన వ్యక్తి ఒక మూలన కూర్చుని ఉండకుండా పెళ్లికి వచ్చిన అతిథులకు విందుతోపాటు కరోనాను కూడా వడ్డించాడు.

పెళ్లికి వచ్చిన అతిథులకు అరుణ్ మిశ్రాకి కోవిడ్ అనే విషయం తెలియక అతిథులు అందరూ భోజనాలు చేశారు.అదేవిధంగా పెళ్లిలో నిర్వహించిన సంగీత కార్యక్రమంలో కూడా అందరితో కలిసి డాన్సులు వేశాడు. పెళ్ళి తంతు ముగిసిన తర్వాత లుహుర్‌గువా గ్రామంలో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. ఉన్నపళంగా కేసులు పెరగడానికి కారణం ఏమిటని అధికారులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.

Advertisement

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు అతనిపై, ఇద్దరు స్నేహితుల పై కేసు నమోదు చేశారు. గ్రామంలో 40 మందికి పాజిటివ్ రావడంతో ఆ గ్రామం మొత్తాన్ని రెడ్ జోన్ గా పరిగణించారు. అదేవిధంగా పెళ్లికి అధికారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని,పాజిటివ్‌గా వచ్చిన అరుణ్ మిశ్రాను క్యారంటైన్‌కు తరలించలేదని, కనీసం వారి ఇంటి ముందు ఎటువంటి నోటీసులు అంటించడం లేదని స్థానికులు తెలియజేశారు.

Advertisement

Featured

Pawan Kalyan : రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్ చేస్తున్న పవన్..!

Published

on

ఇప్పటి వరకూ మనం చూస్తున్న రాజకీయాలు వేరు.. ఇప్పుడు మనం చూస్తున్న రాజకీయాలు వేరు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకు ముందు అధికారంలో ఉన్నవారిని గుత్తాగానో.. లేదంటే సింగిల్‌గానో మూసేయాలి.. విపక్షం అనేది లేకుండా చూసుకోవాలి. ప్రస్తుతం పాలిటిక్స్‌లో నడుస్తున్న ట్రెండ్ ఇదే. అయితే నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తా అని ఏదో సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ పవన్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటా ట్రెండ్ అంటారా? కక్ష సాధింపులకు చెక్ పెట్టాలనేది. ఏ అధికార పార్టీ అయినా కక్ష సాధింపులకు పాల్పడటం సర్వసాధారణం. పవన్ మాత్రం వద్దు అంటున్నారు. పైగా తను తప్పు చేసినా కూడా చర్యలు తీసుకోండని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. వాస్తవానికి ఈ మాట చెప్పాలంటే గట్స్ ఉండాలి. అదేదో నోటి నుంచి వచ్చిన మాటలా అనిపించలేదు. హృదయాంతరాల నుంచి వచ్చిన మాట. ఒక స్ట్రాంగ్ స్టేట్‌మెంట్. నిశ్శబ్దాన్ని చీల్చే మాట. సంచలనానికి నాంది పలికిన మాట. వాస్తవానికి ఈ తరహా ప్రకటనలు అధికారంలో ఉన్న పార్టీల నేతల నుంచి ఏమాత్రం ఆశించలేము.

అవినీతి ఆస్కారం లేని పాలనను అందిద్దాం..

అధికారంలో ఉన్నవారు తప్పు చేసినా కూడా తాము తప్పు చేయలేదని గట్టిగా వాదిస్తుంటారు. అలాంటిది చేస్తే చర్య తీసుకోమన్నారు. పైగా తన పార్టీ నేతలను సైతం కక్షలు కార్పణ్యాల జోలికి వెళ్లవద్దని గట్టిగానే చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా వపన్ విభిన్నమైన రాజకీయం చేస్తున్నారు. ఎవరినీ విమర్శించడం లేదు. ప్రజా సమస్యలు.. అధికారులతో సమీక్షలు తప్ప మరి వేటిని పట్టించుకోవడం లేదు. బాధ్యతగా ఉండాలని చెప్పడం కాదు.. తాను బాధ్యతగా ఉండి చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవికి ఒక హూందాతనాన్ని తీసుకొచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం గట్టిగా ఉంటుందని.. గత ప్రభుత్వం తప్పులు చేశారని మనమూ చేయనక్కరలేదని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ రాజకీయ కక్షలు విరమించాలన్నారు. ఎవరైనా తప్పు చేస్తే.. చట్ట ప్రకారం వెళ్లాలి తప్ప వ్యక్తిగత దాడులకు దిగవద్దని సూచించారు. అవినీతి ఆస్కారం లేని పాలనను ప్రజలకు అందిద్దామని తెలిపారు.

Advertisement

జగన్ నానా రచ్చ చేస్తున్న తరుణంలో..

వాస్తవానికి ఇవన్నీ సినిమాల్లో మాత్రమే చూడగలం.. కానీ వాస్తవంలోనూ చూపిస్తూ పవన్ రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో అనిపించుకుంటున్నారు. తప్పు ఎవరు చేసినా.. చివరకు తానే చేసినా శిక్షకు సిద్ధమని పవన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని పవన్ కోరారు. రాష్ట్రాన్ని పునర్మించుకునేందుకు అంతా కృషి చేయాలని పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగు నేలపై జన్మించిన మహానుభావులను పవన్ గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పవన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ వైసీపీ అధినేత జగన్ ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కక్ష సాధింపు రాజకీయాన్ని ఎన్డీఏ చేస్తోందంటూ నానా రచ్చ చేస్తున్న తరుణంలో పవన్ మాటలను జనసైనికులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. నెట్టింట పవన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisement
Continue Reading

Featured

AP: ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది… ఢిల్లీ ధర్నాలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

Published

on

AP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను ప్రశ్నిస్తూ ఢిల్లీలో ధర్నా చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలో జంతర్ మంతర్ లో ఈయన ధర్నాకు దిగారు. ఇందులో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు.

రాష్ట్రంలోని పరిస్థితులపై ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఫోటో ఎగ్జిబిషన్ చూడటం కోసం రావాలని పలువురు పార్టీ నేతలను కూడా విజయసాయిరెడ్డి ఆహ్వానించారు. ఇక నేడు ధర్నాలో పాల్గొనడం కోసం గత రాత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఇకపోతే ధర్నాలో పాల్గొన్నటువంటి ఈయన కూటమి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.

ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక 30 మందికిపైగా తమ పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలియజేశారు.ఆస్తులను ధ్వంసం చేశారని అన్నారు. లోకేశ్ రెడ్‌బుక్‌ హోర్డింగ్‌లను ఏపీలో పెట్టారని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదని తెలిపారు.

Advertisement

రెడ్‌బుక్‌ హోర్డింగ్‌…
ఇలా ఢిల్లీలో ధర్నా చేసినటువంటి జగన్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కాకుండా కూటమి ప్రభుత్వ తీరుపై రాష్ట్రపతికి ప్రధానికి కూడా ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి అలాగే పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Viral News: పీత డెక్క పై నరసింహ స్వామి రూపం.. వైరల్ అవుతున్న ఫోటో?

Published

on

Viral News: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎన్నో వింతలు విశేషాలు ప్రతి ఒక్కరికి క్షణాలలో తెలిసిపోతున్నాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక అరుదైన పీత ఫోటో వైరల్ అవుతుంది. ఈ పీత డెక్క పై సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

కోనసీమ జిల్లా, సకినేటి పల్లిలో పీత డెక్కపై లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించింది. ఈ గ్రామానికి చెందిన కాగితం కృష్ణ అనే వ్యక్తికి గోదావరి ఒడ్డున ఈత కనిపించడంతో దానిని తీసుకుని ఇంటికి వెళ్లారు. అయితే ఆపీతను కృష్ణ కుమార్తె నీళ్లలో వేయగా ఆ సమయంలో పీత డెక్కపై లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించింది.

నరసింహస్వామి రూపం..
ఈ విధంగా పీత డెక్కపై నరసింహస్వామి రూపం కనిపించడంతో వెంటనే ఈ విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆపీతను చూడటానికి వచ్చారు అయితే ఆ పీత డెక్క పై నరసింహస్వామి రూపం కనిపించడంతో వెంటనే కృష్ణ దానిని తిరిగి గోదావరి నదిలో వదిలివేశారు. ప్రస్తుతం ఈ పీతకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Continue Reading
Advertisement

Trending

Don`t copy text!