లావు తగ్గాలా.. అయితే ఈ నాలుగు రకాలు పిండి రొట్టెలను తినండి..!

0
890

బరువు తగ్గడం అనేది అంత సులువైన పద్దతి కాదు. దాని కోసం ఎతో శ్రమించాల్సి వస్తుంది. డైట్ ను ఫాలో కావాల్సి వస్తుంది. అందులో మనం ఇష్టపడే వాటిని కూడా పక్కన పెట్టేయాల్సి వస్తుంది. బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు తగ్గాలంటే.. మరి నిపుణులు సూచించిన విధంగా ఫాలో కావాలి. లేదంటే బరువు తగ్గడం అనేది అసాధ్యం అవుతుంది.

అయితే శారీరక శ్రమతో సంబంధం లేకుండా ఇక్కడ మనం చెప్పే చిన్న చిట్కాలతో బరువును ఈజీగా తగ్గించుకోవచ్చు. అందులో కొన్ని రకాల పిండితో తయారు చేసే రోటీలు బరువు తగ్గడానికి ఉపకరిస్తాయట. ఈ పిండి పదార్థాల్లో ఆరోగ్యకరమైన న్యూట్రియేంట్స్‌ ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. అందులో మొదటిది జొన్న పిండి. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి.

దీంతో ఎన్నో రకాలు పిండి వంటలను చేసుకోవచ్చు. మన పూర్వికులు కూడా జొన్న పిండిని జొన్న రొట్టెల కోసం ఉపయోగించేవారు. దీనిలో ఎక్కువగా కాల్షియం, ఐరన్, విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇలా జొన్న రొట్టెలతో కొవ్వుకు ఫుల్ స్టాప్ పెట్టేయవచ్చు. మరొక పిండి.. రాగి పిండి. దీనిలో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో బరువు సులువుగా తగ్గవచ్చు.

ఇది అత్యంత సులభంగా జీర్ణం అవుతుంది. ఇక సజ్జలకు సంబంధించిన పిండిలో కూడా ప్రోటీన్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటి ద్వారా ఒంట్లో ఉన్న వేడి తగ్గించుకోవచ్చు. దీంతో మనకు ఆకలి అనేది కాదు. ఇక చివరిది ఓట్స్‌ ఫ్లోర్‌. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆహారం. ఇది తీసుకుంటే ఆకలి అనేది త్వరగా వేయదు. దీనిలో ఫైబర్స్ అనేది ఉంటాయి. దీంతో బరువును సులువగా తగ్గవచ్చు.