మహిళలు గాజులు వేసుకోవడం వెనుక శాస్త్రీయ కారణాలు మీకు తెలుసా..?

0
132

కొన్ని వందల సంవత్సరాల నుంచి మహిళలు గాజులు వేసుకోవడం అనే సాంప్రదాయం కొనసాగుతోంది. చేతినిండా గాజులు వేసుకుంటే మహిళలు ఎంతో అందంగా కనిపిస్తారు. కాలం మారే కొద్దీ కొత్తకొత్త డిజైన్లతో గాజులు అందుబాటులోకి వస్తూ ఉండటంతో వయస్సుతో సంబంధం లేకుండా మహిళలు గాజులు ధరించడాన్ని ఇష్టపడుతున్నారు. అయితే మహిళలు గాజులు ధరించడం వెనుక శాస్త్రీయపరమైన కారణాలు కూడా ఉన్నాయి.

మన దేశ సాంప్రదాయం ప్రకారం పెళ్లైన మహిళలు గాజులు వేసుకుంటే భర్త, పిల్లలు సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. గాజు కొత్తవి వేసుకునే సమయంలో సైతం కొత్త గాజులను వేసుకున్న తరువాతే పాత గాజులను పగలగొట్టాలి. గాజులు వేసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. అందువల్లే పెద్దలు గాజులు వేసుకోకుండా చేతులను ఉంచకూడదని చెబుతూ ఉంటారు.

మనిషి చేతి మణికట్టు నిరంతరం ఏదో ఒక పనిని చేస్తూ ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళలు వంట పని కోసం చేతులతో ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. మహిళలు గాజులు వేసుకోవడం వల్ల గాజుల ఘర్షణ రక్తప్రసరణను పెంచడంతో పాటు శరీరంలో లోపల ఉన్న శక్తిని బయటకు పోకుండా చేస్తుంది. గాజుల సవ్వడి కడుపులోని బిడ్డకు వినికిడి సామర్థ్యాన్ని పెంచుతుంది.

మహిళలు ఎవరైతే మట్టిగాజులు వేసుకుంటారో వారు చురుకుగా ఉంటారని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. గాజులు మహిళల్లో సున్నితత్వాన్ని, ఓదార్పును పెంచుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మహిళలు ఎక్కువగా ఎరుపు, పచ్చ రంగు గాజులు ధరిస్తూ ఉంటారు. ఈ రంగుల గాజులు శాంతియుతంగా, శక్తివంతంగా ఉండటానికి సహాయపడతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here