అద్భుతమైన స్కూటర్లు.. రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు!

0
95

గత కొంత కాలం నుంచి స్కూటర్లు వినియోగం ఎంతో పెరిగిపోయింది. ఇప్పటికే మార్కెట్లో ఎన్నో స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొత్తగా స్కూటర్ కొనాలనుకుంటున్నారా? కొత్తగా స్కూటర్ కొనాలనుకునే వారికి ఈ స్కూటర్లు ఎంతో మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో ఎలక్ట్రానిక్ స్కూటర్ లకు ఆదరణ పెరిగింది. పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ లను కొనడానికి మొగ్గుచూపుతున్నారు.

ఇప్పటికే మార్కెట్లో ఎన్నో రకాల ఇ-స్కూటర్లు  అందుబాటులోకి వచ్చాయి.అయితే ఈ స్కూటర్లను కొనుగోలు చేసే వినియోగదారులు ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేకుండా నడపవచ్చు. వీటిలో కూడా వివిధ రకాల స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఈ2 స్కూటర్‌ ఒకటి. ఈ స్కూటర్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్ళవచ్చు. ప్రతి రోజు నాలుగు నుంచి ఐదు గంటల పాటు ఛార్జింగ్ పెడితే దాదాపు 65 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు.యాంపేర్ ఆర్ఈవో ఎలైట్ స్కూటర్ ఇది కూడా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే ఒకసారి ఛార్జింగ్ పెడితే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు.

ఒకినావా ఆర్30 ఈ స్కూటర్ గంటలకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఒకసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. అదే విధంగా హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా ఈ5 స్కూటర్ ఇది గంటకు 25 కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఒకసారి ఛార్జింగ్ తో 65 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అయితే ఇ-స్కూటర్లను ఎటువంటి రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపవచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here