ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో భారీగా ఫీజు తగ్గింపు..?

0
320

కరోనా వైరస్ విజృంభణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రుల జీవన విధానంలో అనేక మార్పులొచ్చాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి చాలా కుటుంబాల్లో నెలకొంది. పిల్లలకు ఆన్ లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్ కొనివ్వడానికి కూడా కొన్ని కుటుంబాలు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఐతే మహమ్మారి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా విద్యా సంస్థలు స్కూల్ ఫీజులను తగ్గించడం లేదు సరికదా గతేడాదితో పోలిస్తే 10 నుంచి 20 శాతం పెంచుతున్నాయి.

దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూల్ ఫీజులను ఎలా చెల్లించాలో తెలియడం లేదు. ఇలాంటి సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో మాట్లాడి ఫీజుల్లో ఏకంగా 25 శాతం తగ్గేలా చేసింది. ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో చోటు చేసుకున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని గుజరాత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఫీజుల రాయితీకి ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించడంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈ విద్యాసంవత్సరానికి గుజరాత్ రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు రాయితీ అమలు కానుంది. గుజరాత్ రాష్ట్ర విద్యాశాఖమంత్రి భూపేంద్రసిన్హా మాట్లాడుతూ కోర్సు ఫీజుల్లో 25 శాతం రాయితీ ఇచ్చేలా రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను ఒప్పించామని వెల్లడించారు.

సీబీఎస్‌ఈ పాఠశాలల్లో సైతం 25 శాతం ఫీజు రాయితీ అమలవుతుందని చెప్పారు. ఒడిశా ప్రభుత్వం కూడా ఫీజులను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దిశగా అడుగులు వేస్తే విద్యార్థులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ప్రభుత్వాలు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్థికంగా చితికిపోయినవారికి ఫీజుల తగ్గింపు నిర్ణయం ఊరట కలిగిస్తుందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here