వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో ఎంపీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈడీ కేసులను తొలుత విచారణ జరపాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

కాగా సీబీఐ, ఈడీ కేసులను సమాంతరంగా విచారించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ విజయసాయిరెడ్డి తరుపున న్యాయవాది కోర్టులో వాదనలను వినిపించారు. దీంతో విజయసాయి వాదనలను తోసిపుచ్చుతూ సీబీఐ కోర్టు నిర్ణయాన్నే సమర్థించింది. మరోవైపు ఇదే అంశంపై జగతి పబ్లికేషన్స్, రఘురాం సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్లనూ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
































