Jordar Sujatha: బుల్లితెర లవ్ బర్డ్స్ గా పేరు సంపాదించుకున్న రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత గురించి పరిచయం అవసరం లేదు జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేసిన ఈ కమెడియన్స్ ప్రేమలో ప్రేమలో విహరిస్తూ ఉండగా ఇదే విషయాన్ని జబర్దస్త్ వేదికగా అభిమానులకు తెలియజేశారు.ఇలా తమ ప్రేమ విషయాన్ని ప్రకటించిన అనంతరం ఈ జంట చట్టా పట్టాలు వేసుకొని పలు ప్రదేశాలలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక వీరి ప్రేమ విషయాన్ని గత ఏడాదిలో వెల్లడించిన ఈ జంట పెళ్లి ఈ ఏడాదిలో చేసుకోబోతున్నామని తెలియజేశారు. అయితే జోర్దార్ సుజాత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించారు. మా ప్రేమ ప్రయాణం గమ్యం చేరుకుంది అంటూ ఒక వీడియోని విడుదల చేశారు.
ఈ వీడియోలో భాగంగా రాకింగ్ రాకేష్ తో తన పరిచయం ఎలా ఏర్పడింది ఆ పరిచయం స్నేహంగా ప్రేమగా ఎలా మారిందనే విషయాలన్నింటిని తెలియజేశారు.మా ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపారని ఇకపై మా రిలేషన్ పై ఎవరికి అనుమానాలు ఉండవని ఈమె తెలియజేశారు.ఇక ఈనెల చివరిన తన నిశ్చితార్థం జరగబోతుందని అదే రోజున లగ్న పత్రిక కూడా రాయబోతున్నారని తెలిపారు.

Jordar Sujatha:ఆ విషయంలో నేను అదృష్టవంతురాలని….
నిశ్చితార్థం రోజే తన పెళ్లి తేదీ కూడా ఖరారు కానుంది అని జోర్దార్ సుజాత ఈ వీడియో ద్వారా తన నిశ్చితార్థం పెళ్లి గురించి అధికారకంగా తెలియజేశారు.ఇక తన నిశ్చితార్థపు వీడియోతో పాటు తన పెళ్లి తేదీకి సంబంధించిన మరొక వీడియోని కూడా అభిమానులతో పంచుకుంటానని ఈ వీడియో ద్వారా తెలియజేశారు. ప్రతి ఒక్క ఆడపిల్ల మంచి భర్త మంచి ఫ్యామిలీ రావాలని కోరుకుంటారు. ఈ విషయంలో తాను ఎంతో అదృష్టవంతురాలని అంటూ జోర్దార్ సుజాత సంతోషం వ్యక్తం చేశారు.