పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, ఏకే రీమేక్ ని,వీరమల్లు సినిమాలని పూర్తి చేసే విధంగా ముందుకు వెళుతున్నాడు.. వకీల్ సాబ్ సినిమా జులై 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దిల్ రాజు నిర్మాత వేణు శ్రీరామ్ దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఉండగా బాలీవుడ్ లోని పింక్ సినిమా కి ఇది రీమేక్..

ఇక అయన రాజకీయ విషయాల కొస్తే జనసేన బీజేపీ తో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తుంది. దానివల్ల జనసేన మిస్ అయ్యింది అని చెప్పాలి. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా చేసిన బీజేపీ పార్టీ జరగబోయే తిరుపతి ఎన్నికల్లో సైతం పోటీ చేయనీయకూడదని చూస్తుంది.. ఇక స్థానిక ఎన్నికల్లో జనసేన హవా చూపిస్తుంది.. అనుకున్న సీట్లకన్నా ఎక్కువ స్థానాల్లో జనసేన గెలవడంతో జనసేన లో ఆశలు చిగురిస్తున్నాయి.. ప్రజల్లో పవన్ కళ్యాణ్ పై ఇంకా నమ్మకం ఉందని ఈ ఎన్నిక గుర్తిస్తుంది..

ఇక పాలిటిక్స్ అంటేనే ఎంత కమర్షియల్ రంగమో అందరికి తెలిసిందే. అడుగు తీసిన అడుగు వేసినా పైసానే మాట్లాడుతుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అందుకు భిన్నమైన రాజకీయం చేస్తున్నారు. జీరో బడ్జెట్ రాజకీయాలతో ముందుకు వెళుతూ ఇతర రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇది ఎంతో మంచి పరిణామమని అంటున్నారు ప్రజలు.. డబ్బు లు వెదజల్లి ఓట్లు కొనుకుంటున్న పార్టీ లు ఉన్న ఈరోజుల్లో ఇలా ప్రజల మనసుని దోచుకుని జనసేన ఓట్లు సంపాదించడం ప్రజల్లో మార్పు రావడమే అని అంటున్నారు. మరి ఇలానే చేసి జనసేన పార్టీ వచ్చే ఎన్నికల వరకు ఈమేరకు బలపడుతుందో చూడాలి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here