టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ద్విపాత్రాభినయం పోషించిన హీరోలు చాలామందే ఉన్నారు..నేటి సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు ఒకటికి మించే ఉన్నాయి. ఐతే తర్వాతి తరం హీరోలు మాత్రం ద్విపాత్రాభినయాలు చేయడంలో కొంచెం వెనుకబడే ఉన్నారు.ఐతే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ‘బాహుబలి’లో రెండు పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే.

కాకపోతే ఆ ఆ రెండు పాత్రలు ఒకే సమయంలో కనిపించవు. వేర్వేరు కాలాల్లో ఉంటాయి. ఐతే త్వరలో ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు ప్రభాస్‌లను చూడబోతున్నట్లుగా ఇప్పుడో ఆసక్తికర రూమర్ హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’లో అతను డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడట.ఇందులో ఒకటి తండ్రి పాత్ర కాగా.. మరొకటి కొడుకు పాత్ర అంటున్నారు.సినిమాలో లీడ్ రోల్‌ కొడుకు పాత్రదే.

సినిమా అంతా ఆ పాత్ర కనిపిస్తుందట. ఐతే తండ్రి పాత్ర కాసేపు ఉంటుందని.. దాని కోసం ప్రభాస్ భిన్నమైన మేకప్‌లో కనిపించనున్నాడని అంటున్నాడు. కెరీర్లో తొలిసారిగా ఇందుకోసం వృద్ధుడిగా మేకప్ వేసుకోనున్నాడట యంగ్ రెబల్ స్టార్. ప్రభాస్‌ వృద్ధుడిగా కనిపించబోతున్నాడంటే ఆ అవతారం ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో కలగడం ఖాయం. ఈ సినిమా కోసమే ప్రభాస్ కోర మీసంతో కొత్తగా కనిపిస్తుండటం తెలిసిందే.సలార్‌గా ప్రభాస్ ఫస్ట్ లుక్ చాలా ఎగ్జైటింగ్‌గానే అనిపించింది.

ఇక అందులో వయసు మళ్లిన పాత్ర లుక్ ఎలా ఉంటుందో చూడాలి. రెండు షెడ్యూళ్ల షూటింగ్ జరిపాక ఈ సినిమా నుంచి ప్రభాస్ బ్రేక్ తీసుకున్నాడు. దీంతో సమాంతరంగా అతను ‘ఆదిపురుష్’ కూడా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఐతే ఆ చిత్రం షూటింగ్ ఇలా మొదలైందో లేదో అలా ఆగిపోయింది. దీనికి కారణం కరోనానే..ఇక పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ప్రభాస్ ఈ సినిమాల షూటింగ్స్ ని ఫినిష్ చేయనున్నాడు…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here