Connect with us

Featured

Ram Charan: పవన్ కోసం హుటాహుటిన హైదరాబాద్ వచ్చిన చరణ్… బాబాయ్ కి సెక్యూరిటీ టైట్ చేసిన అబ్బాయ్!

Published

on

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జపాన్ లో విడుదలైనటువంటి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ల కోసం తన భార్య ఉపాసనతో కలిసి జపాన్ వెళ్లిన విషయం మనకు తెలిసిందే. అయితే జపాన్ నుంచి ఈ దంపతులు టాంజానియా వెకేషన్ వెళ్లారు. ఇలా టాంజానియా అడవులలో ఎంజాయ్ చేసినటువంటి ఈ దంపతులు తిరిగి ఇండియా వచ్చారు.

ఇకపోతే రామ్ చరణ్ ఇంత హడావిడిగా ఇండియా తిరిగి రావడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. గత కొంత రోజులుగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ప్రతి కదలికల గురించి గుర్తు తెలియని వ్యక్తులు తనని గమనిస్తూనే ఉన్నారని తన ఇంటి చుట్టు పరిసర ప్రాంతాలలో రెక్కీ నిర్వహిస్తూ తన ప్రతి కదలికను గమనిస్తూ ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కొందరు యువకులు పవన్ కళ్యాణ్ సిబ్బందితో తీవ్రస్థాయిలో గొడవ పెట్టుకోవడంతో పవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు.వైజాగ్ పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ పట్ల ఈ విధమైనటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఎంతోమంది అభిమాన నటుడికి, నాయకుడికి ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Ram Charan: రంగంలోకి దిగిన రామ్ చరణ్…


ఇలా పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు ఉండడంతో ఆయనకు మరింత భద్రత కల్పించాలంటూ అభిమానులు డిమాండ్ చేశారు. ఇక ఈ విషయం తెలిసినటువంటి రామ్ చరణ్ వెంటనే హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం.చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ ఎంతో అమితంగా ప్రేమించే రామ్ చరణ్ తన బాబాయికి ప్రాణహాని ఉందని తెలియడంతో తన బాబాయ్ కోసం మరింత సెక్యూరిటీని టైట్ చేశారని తెలుస్తోంది. తన సెక్యూరిటీని కూడా పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ నియమించారట. ఇలా బాబాయ్ కోసం అబ్బాయ్ రంగంలోకి దిగడంతో మెగా అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Featured

YS Jagan: రేవంత్ రెడ్డికి తెలియకుండానే జగన్ రెడ్డి ఇంటి ముందు కూల్చివేతలు జరిగాయా?

Published

on

YS Jagan: తెలంగాణలో ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు చోటు చేసుకున్నటువంటి కూల్చివేతల సంచలనంగా మారాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాదులోని బంజారాహిల్స్ లోటస్ పాండ్ వద్ద భవనం ఉన్న విషయం తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో కొనసాగుతున్నందున ఈ ఇంట్లో చాలాకాలం నుంచి నివాసం ఉండట్లేదు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.

ఇకపోతే లోటస్ పాండ్ వద్ద ఉన్నటువంటి తన ఇంట్లో తన చెల్లెలు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తన తల్లి విజయమ్మ ఉంటున్నారు. ఈమె తెలంగాణ ఆంధ్ర రాజకీయాలలో చురుగ్గా ఉన్నా కూడా ఇక్కడి నుంచే కార్యాచరణ నిర్వహించేవారు. అయితే తెలంగాణలో అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నటువంటి తరుణంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు సెక్యూరిటీ కోసం వేయించుకున్న మూడు షెడ్లను కూల్చి వేశారు.

ఈ విధంగా జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలు నిర్వహించడంతో రహదారి చాలా అసౌకర్యంగా మారిందని ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ హేమంత్‌ ఈ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయం పై అధికారులకు కూడా తెలియకుండా జరిగాయని తాజాగా మరొక వైరల్ గా మారింది.

Advertisement

సీఎంకు తెలియదా…
ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలను తొలగిస్తున్నటువంటి విషయం తెలియదని, అయితే ఈ కూల్చివేతలు జరిగిన 24 గంటల లోపే సదరు అధికారిపై సస్పెన్స్ వేటు వేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.జగన్ ఇంటి వద్ద ఆక్రమణలను తొలగించాలంటూ దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి ఒకరు మౌఖిక ఆదేశాలను జారీ చేయడం వల్లే జీహెచ్ఎంసీ అధికారులు అక్కడ కూల్చివేతలు నిర్వహించారు. అయితే ఈ కార్యాచరణలో భాగంగా అధికారి హేమంత్ పై సస్పెన్షన్ వేటుపడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారండి.

Advertisement
Continue Reading

Featured

Ap: ఏపీ రుషికొండ భవనాలపై విమర్శలు.. సంచలన పోస్ట్ చేసిన వైసీపీ!

Published

on

Ap: జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఈయన ఋషికొండను తవ్వడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇలా కొండలను తవ్వి సంపదను మొత్తం దోచుకుంటున్నారంటూ అప్పటి ప్రతిపక్ష నేతలు విమర్శలు చేశారు అయితే ఎవరు ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్ కు మరింత అందాన్ని రెట్టింపు చేస్తూ అక్కడ ప్రభుత్వ భవనాలను నిర్మించారు.

ఇక తాను రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైజాగ్ నుంచి పరిపాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ధీమా వ్యక్తం చేశారు కానీ ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు రావడంతో ప్రస్తుతం ఈ బంగ్లాలు అన్నీ కూడా అధికారంలో ఉన్నటువంటి కూటమి నేతల చేతులలోకి వెళ్లిపోయాయి.

ఇప్పటివరకు ఋషికొండ ప్రాంతంలో కట్టిన ఆ బంగ్లా ఎలా ఉంది అనే విషయాలు బయటకు రాలేదు కానీ మొదటిసారి తెలుగుదేశం పార్టీ నేతలు బంగ్లాలలోకి అడుగుపెట్టిన తర్వాత పెద్ద ఎత్తున ఆ ఫోటోలను వైరల్ చేస్తూ ఎవరికోసం ఈ బాత్రూములు కట్టించావు అంటూ వైసీపీ పై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

జగన్మోహన్ రెడ్డి ఎవరికో స్కెచ్ వేసే ఇలా ఖరీదైన బాత్రూం కట్టించారు అంటూ విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు అయితే తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఈ విమర్శలపై వైసీపీ స్పందించింది.

అవి ప్రభుత్వ భవనాలే..
రిషి కొండల్లో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా ప్రభుత్వ భవనాలే అవేవీ ప్రైవేట్ భవనాలు కావు. విశాఖకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యంలో భాగంగానే వీటిని నిర్మించారు.. విశాఖ ఆర్థిక రాజధాని అని చంద్రబాబు 1995 నుంచి ఊదరగొడుతున్నారు.. అలాగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి విశాఖకు వస్తే ఆదిత్యం ఇవ్వడానికి సరైన భవనం లేకపోవడం వల్లే వీటిని నిర్మించారని కానీ ఇప్పుడు టిడిపి పార్టీ ఈ ఫోటోలను విమర్శిస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తోంది అంటూ తెలిపారు.. టిడిపి వక్ర బుద్ధి అంటే ప్రజలకు తెలుసు అంటూ తెలియజేశారు.

Advertisement
Continue Reading

Featured

Renu Desai: బుద్ధి ఉంటే ఇలా మాట్లాడవు… పవన్ అభిమానికి ఇచ్చి పడేసిన రేణు దేశాయ్?

Published

on

Renu Desai: పవన్ కళ్యాణ్ భార్యగా రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే అయితే ఈమె పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఆయనకు దూరమయ్యారు. తనకు తెలియకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతోనే తాను విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అంటూ పలు సందర్భాలలో రేణు దేశాయ్ వెల్లడించారు.

ఇలా పవన్ కళ్యాణ్ కు దూరంగా తన పిల్లలతో కలిసి బ్రతుకుతున్న ఈమె పట్ల తరచూ పవన్ కళ్యాణ్ అభిమానులు చేసే కామెంట్లతో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవకు దారితీస్తుంది అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో ఆయన పిల్లలు తన వెంటే ఉంటున్నారు.

ఇక ఈ విషయంపై రేణు దేశాయ్ కూడా సంతోషం వ్యక్తం చేసింది అయితే ఒక అభిమాని మాత్రం రేణు దేశాయ్ ను ట్యాగ్ చేస్తూ చేసిన పోస్టుపై రేణు దేశాయ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా సుధాకర్ అనే అభిమాని వదిన గారు మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు. కానీ ఈరోజు అయినా మీకు పవన్ విలువ తెలిసింది.

Advertisement

పవనే నన్ను వదిలేసాడు..
ఏది ఏమైనా విధి ప్రతిదీ నిర్ణయిస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన. మిమ్మల్ని మిస్ అవుతున్నాము అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ పోస్ట్ పై రేణు దేశాయ్ స్పందిస్తూ సుధాకర్ గారు మీరు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా.. బుద్ధి ఉంటే ఇలా మాట్లాడరు పవన్ కళ్యాణ్ కు నేను విడాకులు ఇవ్వడం ఏంటి ఆయనే నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. దయచేసి నన్ను టార్చర్ చేయకండి అంటూ ఈమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!