Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా హీరోగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి రామ్ చరణ్ వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు.

ఇక ఈ సినిమాకు లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా డైరెక్టర్ శంకర్ పట్ల రామ్ చరణ్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ అభిమానులు శంకర్ పై కోప్పడటానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శంకర్ దర్శకత్వం వహిస్తున్న రెండు సినిమాల నుంచి అప్డేట్స్ విడుదల చేశారు.
ఈ క్రమంలోనే కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2సినిమా నుంచి కమల్ హాసన్ కి చెందిన ఒక స్టిల్ విడుదల చేశారు. దీంతో కమల్ ఫ్యాన్స్ ఎంతో సంతోషంలో ఉన్నారు. అయితే రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ మాత్రం షూటింగ్ లొకేషన్లో శంకర్ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు. ఇలా ఈ సినిమా నుంచి ఆయన వర్కింగ్ స్టిల్ విడుదల చేయడంతో చరణ్ ఫాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Ramcharan: చరణ్ స్టిల్ విడుదల చేయొచ్చుగా…
కమల్ హాసన్ స్టిల్ విడుదల చేసినప్పుడు గేమ్ చేంజర్ సినిమా నుంచి కూడా రామ్ చరణ్ స్టిల్ విడుదల చేయాలి కదా అలాకాకుండా శంకర్ వర్కింగ్ స్టిల్ విడుదల చేయడం ఏంటి అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఇక ఈ సినిమా నుంచి కూడా అప్ డేట్స్ విడుదల చేసి చాలా రోజులు అయింది దీంతో ఫాన్స్ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో శంకర్ పై ఫైర్ అవుతున్నారు.
HAPPY INDEPENDENCE DAY from the sets of #GameChanger pic.twitter.com/w5t1nzmHWj
— Shankar Shanmugham (@shankarshanmugh) August 15, 2023