Sreeleela: హీరోలను చూడటం కోసమే టికెట్లను కొనుగోలు చేస్తున్నారు… నటి శ్రీ లీల కామెంట్స్ వైరల్!

0
14

Sreeleela: పెళ్లి సందD సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు యంగ్ బ్యూటీ శ్రీ లీల. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగులో సుమారు అరడజనుకు పైగా సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ విధంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీ లీల తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇక యంగ్ హీరోల నుంచి మొదలుకొని సీనియర్ హీరోల సినిమాలలో కూడా ఈమె నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె ప్రేక్షకులను ఉద్దేశిస్తూ పలు విషయాలను తెలియజేశారు.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారని అయితే ఇప్పటికీ ప్రేక్షకులు సినిమా టికెట్లు కొనుగోలు చేసి థియేటర్ కు వస్తున్నారు అంటే అది కేవలం హీరోలను చూడటానికి మాత్రమేనని తెలియజేశారు.ఇక తాను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను తనకు మంచి పాత్రలలో నటించే అవకాశం వస్తే చాలు కానీ సినిమా మొత్తం తానే కనిపించాలని అసలు అనుకోనని తెలిపారు.

Sreeleela: హీరోల కోసమే ప్రేక్షకులు వస్తున్నారు…


అయితే శ్రీ లీల ఉన్నఫలంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని వస్తే తాజాగా ఈమె రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా మొత్తం పూర్తిగా శ్రీ లీల కనపడుతోందని, ఈ సినిమా విజయం మొత్తం తనకే చెందుతుంది అంటూ కామెంట్స్ వినిపించిన తరుణంలో ఈమె ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.