అమెరికాలో వింత వ్యాధి… వేలల్లో పక్షుల మరణాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక!

0
135

అమెరికాలోని తూర్పు ప్రాంతాలలో ఓ గుర్తు తెలియని వ్యాధి వేలాది పక్షుల పాలిట శాపంగా మారింది. ఈ వ్యాధి కారణంగా వేల సంఖ్యలో పక్షులు చనిపోతున్నాయి. ఎలా పక్షులు చనిపోవటానికి కారణం ఏంటని శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపగా పక్షుల చావుకు గల కారణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించలేక పోయారు.స్టార్లింగ్స్, బ్లూ జేస్, గ్రాకల్స్ వంటి అరుదైన పక్షులు చనిపోతున్న విధానాన్ని బట్టి చూస్తే పక్షులలో అంటు వ్యాధి వ్యాప్తి చెందినట్లు నిపుణులు గుర్తించారు.

ఇలాంటి వ్యాధి గత రెండు నెలల క్రితమే వర్జీనియా, వాషింగ్టన్, మేరీల్యాండ్ రాష్ట్రాల్లో  పక్షులకు వ్యాప్తి చెందిన పక్షులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వ్యాధి కెంటుకీ, డెలావేర్, విస్కాన్సిన్ రాష్ట్రాలకు వ్యాప్తి చెందినట్లు నిపుణులు తెలియజేశారు. ఈ వింత వ్యాధితో మరణించిన పక్షుల కళేబరాలను పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్లో పోస్టుమార్టం జరుగుతోంది. 

ఈ సందర్భంగా ఈ పరిశోధనలో పాల్గొన్న టాక్సికాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ లిసా మర్ఫీ మాట్లాడుతూ..  ఈ విధంగా పక్షుల మరణించడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని గుర్తించలేక పోతున్నామని తెలిపారు. ఈ విధంగా చనిపోయిన పక్షుల కనురెప్పలను చూసినప్పుడు వాటి వెనుక భాగంలో తెల్లటి క్రస్ట్ జమ అయినట్లు తేలిందన్నారు. ఈ కారణంతోనే పక్షులు చూపిన కోల్పోయినట్లు తెలిపారు. అదేవిధంగా పక్షుల మెదడుకు పక్షుల మరణానికి అనుసంధానం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ విధంగా మెదడుతో సంబంధం ఉన్న ఈ వ్యాధి పక్షులను తీవ్రంగా బాధపడుతున్నట్టు గుర్తించారు. అయితే ఈ విధంగా పక్షులు చనిపోవడానికి అసలు కారణం ఏంటన్న విషయాన్ని మాత్రం తెలియడం లేదు. పక్షులు ఏ వ్యాధి కారణం చేత మరణిస్తున్నాయనే విషయాన్ని గుర్తించే వరకు ప్రజలు పక్షులకు చాలా దూరంగా ఉండాలని ఈ సందర్భంగా నిపుణులు హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here