Connect with us

Featured

Vani jayaram death mistry : వాణి జయరాం మృతికి కారణాలు ఇవే… బయటపడ్డ కీలక విషయాలు…!

Published

on

Vani Jayaram death Mistrey : సౌత్ లో నార్త్ లో సింగర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గాయని వాణిజయరాం. తమిళ నాడు వేలూరు కి చెందిన వాణి జయరాం తన గాత్రంతో హిందీ, తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం ఇలా పలు భాషల ప్రేక్షకులను అలరించారు. తెలుగులో ‘పూజ సినిమాలోని ఎన్నెన్నో జన్మల బంధం’ పాటతో బాగా ఫేమస్ అయ్యారు వాణి జయరాం. హిందీ లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వాణి జయరాంకు దక్కవలసిన గుర్తింపు మాత్రం దక్కలేదనే విమర్శలు ఉన్నాయి. 77 ఏళ్ల వయసున్న ఆమె ఫిబ్రవరి 4 న మరణించారు.

హత్య కాదు.. తేల్చిన ఫారెన్సిక్ నిపుణులు…

వాణి జయరాం అనుమానాస్పద స్థితిలో ఆమె ఇంట్లోనే మరణించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆమె మరణం సహజ మరణం కాదు అని ఎవరో హత్య చేసారు అనే పుకార్లు బాగా వినబడ్డాయి. ఇక ఆమె ముఖం మీద గాయాలు ఉండటం వల్ల ఈ వదంతులు ఎక్కువయ్యాయి. అయితే వాణి జయరాం కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఆమె మరణం మీద ఎలాంటి అనుమానాలు లేవంటూ చెప్పారు, సహజంగానే మరణించినట్లు పోలీసులు తేల్చారు. ఆమె గదిలో కిందపడినప్పుడు ముఖానికి, తలకు గాయాలు తగలడంతో మరణించినట్లు ధ్రువీకరించారు.

Advertisement

ఫారెన్సిక్ నిపుణులు ఆధారాలను సేకరించి అలానే అపార్ట్మెంట్ లోని సీసీ టీవీలను పరిశీలించి ఆమెది హత్య కాదని సహజ మరణమని ధ్రువీకరించారు. ఒంటరిగా ఉంటున్న వాణి జయరాం గారు గదిలో కిందపడగానే శబ్దం విన్న పనిమనిషి వచ్చి తలుపు తీయడానికి ప్రయత్నించగా రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూసారు. ఇక వెంటనే పోలీసులకు సమాచారం అందించి అలాగే బంధువులకు సమాచారం ఇచ్చారు. ఇంటిని పోలీసుల అదుపులో ఉంచుకుని ఆధారాలను సేకరించగా అనుమానస్పదంగా ఏమీ కనిపించలేదు. ఇక వాణి జయరాం అంత్యక్రియలు తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో చేసారు. ఆమెను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు వచ్చారు.

Continue Reading
Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

డల్లాస్ లో కొత్త సినిమా..
ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు మాత్రమే కాక.. విదేశీయులు అనగా అమెరికన్స్‌, స్పానిష్‌ పీపుల్‌, ఆఫ్రికన్స్‌, యూరోపియన్స్‌, ఏషియన్స్‌, ఇండియన్స్‌.. మరీ ముఖ్యంగా తమిళ్‌, కన్నడ, తెలుగు నటించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆడిషన్స్ లో కూడా పాల్గొన్నారు. ఇలా అమెరికాలో ఈ సినిమాకి ఇలాంటి ఆదరణ రావడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక విఎన్ ఆదిత్య సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రేక్షకులందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆతృత కనబరుస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!