కొవ్యాక్సిన్ రెండో డోస్ ఆలస్యం అవుతే ఏం అవుతుంది?

0
743

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వైరస్ నుంచి రక్షణ పొందటానికి చేయించుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మనదేశంలో ప్రజలందరికీ కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ టీకాలను వేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే స్పూత్నిక్ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానుంది. మన దేశంలో కోవ్యాక్సిన్ కొరత అధికంగా ఉండడంతో దేశవ్యాప్తంగా అత్యధికంగా కోవీషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే మొదటి డోస్ వ్యాక్సిన్ కోవ్యాక్సిన్ వేయించుకున్న వారు రెండవ డోసు వేయించుకోవడానికి ఆలస్యం అవుతోంది.సాధారణంగా మొదటి డోసు కోవ్యాక్సిన్ తీసుకున్న తరువాత రెండవ డోసు 6 నుంచి 12 వారాల వ్యవధిలోగా తీసుకోవాలి. అయితే ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో రెండవ డోసు ఆలస్యం కావడంతో మొదటి డోసు వేయించుకున్న వారికి పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండవ డోసు ఆలస్యమైతే పరిస్థితి ఏమిటి? ఈ వ్యాక్సిన్ వైరస్ పై ప్రభావం చూపుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మొదటి డోసు కోవ్యాక్సిన్ తీసుకున్నవారు 6 నుంచి 12 వారాల వ్యవధిలో గా రెండవ డోస్ తీసుకోకపోతే వారిలో వైరస్ ను ఎదుర్కొనే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతుందని అందుచేత మరొకసారి మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకొని నిర్ణీత సమయంలోగా రెండవ డోసు కో వ్యాక్సిన్ తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఇలాంటి సలహాలు కేవలం వైద్యులను అడిగి తీసుకోవాలని, వ్యాక్సిన్ విషయంలో సొంత నిర్ణయాలు పనికిరావని నిపుణులు తెలియజేస్తున్నారు.

కోవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్న తరువాత ఎనభై నాలుగు రోజులకు రెండో తీసుకోవాలి. మొదటి డోస్ తీసుకున్న తర్వాత మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించే కణాలు తొందరగా ఏర్పడటంవల్ల ఈ వ్యాక్సిన్ వ్యవధిని పెంచినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. కానీ కోవ్యాక్సిన్ విషయంలో మాత్రం మొదటి డోస్ తీసుకున్న తర్వాత ఆరు వారాలకు రెండో తీసుకోవాలి. ఇలా లేనిపక్షంలో మరొకసారి మొదటి డోస్ వేయించుకొని,రెండవ డోసు సరైన సమయంలో వేసుకునేలా ప్లాన్ చేయాలని నిపుణులు తెలియజేస్తున్నారు.