ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ప్రజలు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. రెండు దశాబ్దాల క్రితం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 4,000 రూపాయలుగా ఉంటే ప్రస్తుతం 50,000 రూపాయలుగా ఉంది. అయితే కొత్త ఏడాదిలో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎవరికైనా బంగారం కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉంటే ఇప్పుడే కొనుగోలు చేస్తే మంచిదని చెబుతున్నారు.

2021 సంవత్సరంలో బంగారం ధర ఏకంగా 63,000 రూపాయలకు చేరే అవకాశం ఉంది. రోజురోజుకు డాలర్ బలహీనపడటం, కొత్తరకం కరోనా విజృంభిస్తూ ఉండటం, ఇతర కారణాల వల్ల బంగారం ధర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగారం ధర పెరిగే అవకాశాలు ఉండటంతో పసిడిపై పెట్టుబడులు పెడితే మంచిది. పసిడి కొనాలనే ఆసక్తి ఉంటే వీలైనంత త్వరగా కొనుగోలు చేస్తే మంచిది.

ఈ ఏడాది ఆగష్టు నెలలో రికార్డు స్థయైలో 59,000 రూపాయలకు బంగారం ధర చేరగా వచ్చే ఏడాది ఈ ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పసిడి ధర పెరగొచ్చనే అంచనాల నేపథ్యంలో పసిడిపై పెట్టుబడులు పెడితే మంచిది. కరోనా మహమ్మారి కారణంగా డబ్బులు ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలనే ఆలోచనలు ఉన్నవాళ్లు వీలైనంత త్వరగా బంగారం కొనుగోలు చేస్తే మంచిది. అయితే బంగారం ధరపై వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతున్న నేపథ్యంలో బంగారం ధరలు 63 వేల రూపాయల కంటే ఎక్కువగా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here