మోదీ సర్కార్ ఆదేశాలు.. అక్కడ నవంబర్ 30 వరకు లాక్ డౌన్..?

0
183

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గుతున్నా కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపుతోంది. కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ ను అమలు చేయకపోతే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. కేంద్ర హోం శాఖ నుంచి ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ అమలవుతున్నా నిబంధనలను మాత్రం కేంద్రం సడలించింది.

ఎలాంటి అనుమతులు అవసరం లేకుం్దానే సరుకు రవాణా చేసుకోవచ్చని, అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కూడా ఎలాంటి అనుమతులు అవసరం లేదని పేర్కొంది. గత నెల 30వ తేదీన వాణిజ్య సంస్థల రీ ఓపెనింగ్ విశయంలో అన్ లాక్ 5 నిబంధనలు విడుదలయ్యాయని.. అవే నిబంధనలను నవంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నామని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఫలితంగా కంటైన్మెంట్ జోన్ల ప్రజలు మరో నెల రోజుల పాటు లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడక తప్పదు.

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలు మాత్రమే ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి. గతంతో పోలిస్తే కేంద్రం కంటైన్మెంట్ జోన్ల సంఖ్యను భారీగా తగ్గించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిమిత సంఖ్యలోనే కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. అధికారులు లాక్ డౌన్ అమలవుతున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర హోం శాఖ తెలిపింది.

మరోఅవైపు దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా బలహీనపడుతోంది. గత నెలలో నమోదైన కేసులతో పోలిస్తే కేసుల సంఖ్య సగానికి తగ్గింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి పరిస్థితి కొనసాగితే కరోనా వ్యాక్సిన్ లేకుండానే మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here