Connect with us

Featured

Sumanth Ashwin : ఆర్థిక సమస్యల వల్ల చెన్నైలోని ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది… ప్రమోషన్స్ కోసం మహేష్ బాబును రమ్మంటే ఏమన్నాడో తెలుసా?! : హీరో సుమంత్ అశ్విన్

Published

on

Sumanth Ashwin : వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఒక్కడు వంటి వరుస బ్లాక్ బస్టర్స్ సినిమాలతో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా మారిన ఎమ్ ఎస్ రాజు వరుసగా మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకుని రికార్డు సృష్టించారు. ఆయన బ్యానర్ సుమంత్ ఆర్ట్స్ లో ఎంతో మంది హీరోలను టాప్ హీరోలుగా చేసారు. ఇక ఎమ్ ఎస్ రాజు గారి తనయుడు సుమంత్ అశ్విన్ ను 2012 లో సినిమాల్లోకి హీరోగా పరిచయం చేసారు. తూనీగ తూనీగ సినిమాతో పరిచయమైన సుమంత్ అశ్విన్ స్వయంగా ఎమ్ ఎస్ రాజుగారే దర్శకత్వం వహించినా ఆ సినిమా పెద్దగా జనానికి ఎక్కలేదు.

ఆర్థికంగా నష్టపోయాం.. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి…

సుమంత్ అశ్విన్ నటించిన మొదటి సినిమా ప్లాప్ అయ్యాక లవర్స్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇక ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమాతో మంచి నటన కనబరిచాడు. ఇక కేరింత, హ్యాపీ వెడ్డింగ్, ఇది మా కథ, కొలంబస్ వంటి సినిమాలలో నటించినా పెద్దగా అతని కెరీర్ కు ఉపయోగపడలేదు. ఇక తాజాగా ‘సెవెన్ నైట్స్ సిక్స్ డేస్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఎమ్ ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సుమంత్ తన తండ్రి గురించి తన సినిమా కెరీర్ గురించి మాట్లాడారు. వరుస ప్లాప్ ల వల్ల ఆర్థికంగా తన తండ్రి నష్టపోయారని, దీంతో చెన్నై లో ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పారు.

Advertisement

చాలా కాలం తరువాత ఎమ్ ఎస్ రాజు గారు దర్శకత్వం వహించిన చిత్రం డర్టీ హరి. ఈసినిమా యువతరాన్ని ఆకట్టుకునేలా చేసిన చాలా బోల్డ్ అట్టెంప్ట్ ఫిల్మ్ అనే చెప్పాలి. ఈ సినిమా తన తండ్రి ఎంత ట్రెండిగా సినిమా తీయగాలడో నిరూపించిందని ఓటీటీ లో ఈ సినిమా చాలా మందికి నచ్చిందని చెప్పారు.

అయినా కూడా ఆయన ఏమాత్రం ఒత్తిడికి లోనవకుండా చాలా కూల్ గా ఆలోచిస్తారని చెప్పాడు. ఇక సోషల్ గా చురుగ్గా ఉండాల్సిన పని లేదని ఇన్ని రోజులు అనుకునే వాడినని కానీ యంగర్ జనరేషన్ కి దగ్గరవ్వాలంటే ప్రొమోషన్స్ బాగుండాలని అర్థమైందని చెప్పారు. మహేష్ మీ సినిమా ప్రమోషన్స్ కి పిలిస్తే వస్తారా అని యాంకర్ అడిగితే.. అప్పుడు మేము పిలిచినపుడు ఆయన అందుబాటులో లేరు.. కానీ అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వస్తారు అంటూ చెప్పారు. వెంకటేష్ గారు నా సినిమాల ప్రమోషనుకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి అంటూ వివరించారు.

Continue Reading
Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!