షేర్లపై కొన్ని లక్షల కోట్ల సంపాదన.. కానీ సంతృప్తి చెందలేదు.. చివరకు 22 లక్షల ఎకరాలు కొనుగోలు చేశారు..

0
247

మనం చదువుకునే రోజుల్లో నిజాం వద్ద కొన్ని లక్షల ఎకారాలు ఉండేవని చదువుకున్నాం. తర్వాత అవి చిన్న చిన్న భాగాలుగా విడిపోయి.. బడా భూస్వాముల వద్ద ఎక్కువగా.. పేదల దగ్గర ఒకటి నుంచి మూడు హెక్టార్ల వరకు భూమి ఉంది. ప్రస్తుతం 100 ఎకరాల భూమి ఉందంటే.. వామ్మో అంటూ అంటుంటాం. కానీ ఇక్కడ మనం చెప్పే వ్యక్తికి ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలిస్తే.. షాక్ అవుతాం. అతడి దగ్గర 22 లక్షల ఎకరాలు ఉన్నాయట. అసలు అతడు ఎవరు.. ఎంది కథ.. తెలుసుకుందాం..

రూపర్ట్ ముర్డోక్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ కు సంబంధించి పత్రికలల్లో ఇతడికి అధిక వాటా కలిగి ఉంది. ఇంతకంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టి.. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకడిగా నిలిచాడు ‘జాన్ మెలోన్’. అతడు తన సొంతంగా అమెరికాలో ‘లిబర్టీ మీడియా’అనే టీవీ ఛానెల్ ను కూడా స్థాపించాడు. ఇతడు వారెన్ బఫెట్ కంటే కూడా ఎక్కవు పెట్టుబడులు పెట్టేవాడు.

ఇలా కొన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం.. షేర్లు కొనడం చేస్తూ ఉంటాడు. అతడికి అంతర్జాతీయ క్రీడ అయిన అట్టాంటా బ్రేవ్స్ అనే బేస్ బాల్ జట్లులో 8 శాతం షేర్లు కొన్నాడు. అతడు ఎక్కువ శాతం మీడియాకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంటాడు. అందులోనే ఎక్కువగా లాభాలను గడిస్తాడు. అయితే ఇంత సంపాదిస్తున్న అతడు భూమిపై ఎందుకు పెట్టుబడి పెట్టాడో తెలుసా.. అతడు వీటిపై ఆధిపత్యం చెలాయించి డబ్బులు సంపాదిస్తున్నా తృప్తి మాత్రం లేదు. ఓ రోజు అతడు పెన్సిల్వేనియాలో ఒక ఫామ్‌కి రెస్ట్ కోసం వెళ్లాడు.

అక్కడ ఒక కుటుంబాన్ని చూసి భూమిపై పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారట. మొదట న్యూ మెక్సికోలోని బెల్‌ రాంచ్‌ను 2.90లక్షల ఎకరాల విస్తీర్ణంతో వ్యవసాయక్షేత్రాన్ని కొనుగోలు చేశారు. తర్వాత ఫ్లోరిడాలో 14 మిలియన్‌ డాలర్లతో 800 ఎకరాల బ్రిడిల్‌వుడ్ ఫామ్స్‌ను సొంతం చేసుకున్నారు. తర్వాత అమెరికాలోని ప్రతీ ప్రదేశంలో భూములు కొనుక్కుంటూ వచ్చాడు. దీంతో అమెరికాలోని అతిపెద్ద భూ ప్వామిగా ఎదిగాడు. అతడి పేరు మీదు కొన్ని వందల హోటళ్లు కూడా ఉన్నాయి. ఇలా అతడు అమెరికాలో అందరికంటే ఎక్కువ భూమి కలిగిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. మొత్తం 22లక్షల ఎకరాల భూమి అతని పేరు మీద ఉంది.