ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి?మన శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గి పోకుండా ఉండాలంటే ఏ విధమైనటువంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనే విషయంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మన శరీరంలో సరైన మోతాదులో ఆక్సిజన్ స్థాయిలు ఉండటం వల్ల శరీర కణాల్లో శక్తిని పెంపొందిస్తుంది.మన శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ ఊపిరితిత్తుల ద్వారా వివిధ భాగాలకు రక్తప్రసరణ చేస్తుంది. అదేవిధంగా అన్ని భాగాల నుంచి కార్బన్ డయాక్సైడ్ గ్రహించి ఊపిరితిత్తులు ద్వారా బయటకు పంపబడుతుంది.

ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో కరోనా వైరస్ ఊపిరితిత్తులపై దాడి చేయడం వల్ల ఆక్సిజన్ మన శరీరానికి అందకపోవడం వల్ల శ్వాస కోసం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే శరీరంలోని ఆక్సిజన్ స్థాయి పడిపోవడం వల్ల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురై మరణిస్తున్నారు.మరి ఆక్సిజన్ స్థాయిలు సరిగా ఉండాలంటే మన శరీరంలో హీమోగ్లోబిన్ శాతం అధికంగా ఉండాలి. హిమోగ్లోబిన్ అభివృద్ధి చెందాలంటే ముందుగా ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

  • తరచు మన ఆహార పదార్థాలలో ఎక్కువ భాగం చాక్లెట్, ఆలుగడ్డ, నువ్వులు, జీడిపప్పు, పుట్టగొడుగులు ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో కాపర్ మన శరీరానికి అందుతుంది.90 గ్రాముల పీతలను తరచు తీసుకోవడం వల్ల ఆ రోజు మనిషికి పడాల్సిన 30% కాపర్ పుష్కలంగా లభిస్తుంది.
  • కోడి మాంసం, టూనా చేపలు, అరటిపండు, పాలకూర
    బ్రసెల్స్‌ మొలకల్లో అధికభాగం విటమిన్‌ బీ6, బీ9 లభిస్తాయి.
  • కోడి గుడ్లు, పాలు, ఓట్స్, బాదం, యాపిల్, బీన్స్, సన్ ఫ్లవర్ వంటి గింజలను తరచూ తీసుకోవడం వల్ల విటమిన్ బి 2 పుష్కలంగా లభిస్తుంది.
  • మేక ,చికెన్, తదితర మాంసాహారంలో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది.బీన్స్‌, ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, పప్పు, బఠాణీ గింజలు తదితరాల్లో పదార్థాలలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ విధమైన ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి ఆక్సిజన్ స్థాయిలు నిలకడగా ఉంటాయి. దీని ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here